కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ స్థాయికి వచ్చా: రేవంత్ రెడ్డి

కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ స్థాయికి వచ్చా: రేవంత్ రెడ్డి
  • ప్రజా రంజక పాలన రావాలని కోరుకుంటున్నా
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి


విధాత‌, హైద‌రాబాద్‌: కొడంగ‌ల్ ప్ర‌జ‌ల ఆశీర్వాదం వ‌ల్లే ఈ స్థాయికి వ‌చ్చాన‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్ లో కూడా మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాన‌న్నారు. కొడంగల్ లోని తన నివాసంలో మూడు రోజుల పాటు చండీయాగం చేయించారు.


శుక్ర‌వారం రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా యాగంలో పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు. తెలంగాణలో ప్రజా రంజకమైన పాలన రావాలని, సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో సమాన స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.


చండీయాగంతో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి సిద్దించాలన్నారు. అలాగే తెలంగాణకు మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నాన‌ని రేవంత్ పేర్కొన్నారు. చండీయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియ‌జేశారు.