రేవంత్‌ రెడ్డి పాదయాత్ర.. మేడారం నుంచే ఎందుకంటే?: MLA సీతక్క

REVANTH REDDY విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వనదేవతలైన సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం నుంచే హాత్ సే హాత్ జోడో యాత్ర ఎందుకు ప్రారంభించారంటే.. ఆ వీర వనితలు ఆనాడు తమ ప్రజల కోసం ఆఖరి శ్వాస వ‌ర‌కు పోరాటం చేపట్టారని.. వారి స్పూర్తిని కొనసాగించేందుకు ఇక్కడి నుంచి యాత్రను ప్రారంభించినట్లు ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత ధనసరి సీతక్క స్పష్టం చేశారు. కాకతీయ ప్రభువులు ఆదివాసులపై చేపట్టిన అణచివేతకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం […]

  • Publish Date - February 6, 2023 / 12:40 PM IST

REVANTH REDDY

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వనదేవతలైన సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం నుంచే హాత్ సే హాత్ జోడో యాత్ర ఎందుకు ప్రారంభించారంటే.. ఆ వీర వనితలు ఆనాడు తమ ప్రజల కోసం ఆఖరి శ్వాస వ‌ర‌కు పోరాటం చేపట్టారని.. వారి స్పూర్తిని కొనసాగించేందుకు ఇక్కడి నుంచి యాత్రను ప్రారంభించినట్లు ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత ధనసరి సీతక్క స్పష్టం చేశారు.

కాకతీయ ప్రభువులు ఆదివాసులపై చేపట్టిన అణచివేతకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందని వివరించారు. ఒకప్పుడు ఆదివాసీలకు దేవతగా కొలువైన సమ్మక్క సారలమ్మలు ప్రస్తుతం అన్ని వర్గాలకు పూజనీయులుగా మారిపోయారని చెప్పారు. ఆ స్పూర్తిని తిరిగి చాటి చెప్పేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నామని వివరించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కుల, మతాలకు తేడా లేకుండా మేడారం వచ్చి తమ అభిమానాన్ని, భక్తిని చాటుకుంటున్నారని గుర్తు చేశారు. కాలి నడకన వచ్చి కాని పైసా లేకుండా సందర్శించుకునే దేవతల్లో మేడారం సమ్మక్క, సారమ్మలు ముందు ఉంటారని వివరించారు.