బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్
విధాత: బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. ప్రధాని రేసులో నుంచి పెన్నీ మోర్డాన్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో యూకే పగ్గాలు చేపడుతున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా.. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తానని, కన్వర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహిస్తానని […]

విధాత: బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. ప్రధాని రేసులో నుంచి పెన్నీ మోర్డాన్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో యూకే పగ్గాలు చేపడుతున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాగా.. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తానని, కన్వర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహిస్తానని రిషి సునాక్ తెలిపారు. దేశం కోసం గతంలో తాను ఎంతో కష్టపడ్డానని, కోవిడ్ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించానని.. తన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని ఆయన కన్జర్వేటివ్ సభ్యులను కోరారు.
తాను నాయకత్వం వహించే ప్రభుత్వానికి ప్రతి స్థాయిలోనూ జవాబుదారీతనం ఉంటుందని, ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడేందుకు నిరంతరం కష్ట పడతానని, దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపిస్తానని సునాక్ చెప్పారు.
ఇంగ్లాండ్ సౌతాంఫ్టన్‌లో జన్మించిన సునాక్ ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారు. తండ్రి యశ్‌వీర్, తల్లి ఉషా సునాక్. తండ్రి కెన్యాలో పుట్టి పెరిగారు. తల్లి టాంజానియాలో పుట్టి పెరిగారు. ఆమె పూర్వీకులు పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవారు. కెన్యా రిషి సునాక్ వించెస్టర్ కాలేజీలో చదువుకున్నారు.
ఆక్స్‌ఫర్డ్, లింకన్ కాలేజీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకానమిక్స్ చదివారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీఏ చేశారు. 2009లో రిషి సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షితామూర్తిని వివాహమాడారు. వీరికి ఇద్దరు సంతానం. కృష్ణా సునాక్, అనౌష్కా సునాక్.