Viral Video | నీటి ఒత్తిడికి ప‌గిలిన పైపులైన్.. బ‌ద్ద‌లైన ర‌హ‌దారి

Viral Video | అండ‌ర్ గ్రౌండ్‌లో వేసే నీటి పైపులు లీక‌వ‌డం, ఆ త‌ర్వాత నీరు వృథాగా పోయే ఘ‌ట‌న‌ల‌ను ఎన్నో చూశాం. ఆ మాదిరిగానే మ‌హారాష్ట్ర‌ (Maharashtra) లోని యావ‌త్మ‌ల్‌లో కూడా ఓ పైపు లైన్ ప‌గిలిపోయింది. నీటి ఒత్తిడికి ఆ పైపులైన్ ప‌గిలిపోవ‌డంతో.. ఏకంగా ర‌హ‌దారి బ‌ద్ద‌లైపోయింది. అనంత‌రం క్ష‌ణాల్లోనే రోడ్డంతా జ‌ల‌మ‌యం అయింది. ర‌హ‌దారి బ‌ద్ద‌లైన స‌మ‌యంలో అటుగా స్కూటీపై వెళ్తున్న ఓ మ‌హిళ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయాల‌పాలైన ఆమెను చికిత్స నిమిత్తం […]

Viral Video | నీటి ఒత్తిడికి ప‌గిలిన పైపులైన్.. బ‌ద్ద‌లైన ర‌హ‌దారి

Viral Video | అండ‌ర్ గ్రౌండ్‌లో వేసే నీటి పైపులు లీక‌వ‌డం, ఆ త‌ర్వాత నీరు వృథాగా పోయే ఘ‌ట‌న‌ల‌ను ఎన్నో చూశాం. ఆ మాదిరిగానే మ‌హారాష్ట్ర‌ (Maharashtra) లోని యావ‌త్మ‌ల్‌లో కూడా ఓ పైపు లైన్ ప‌గిలిపోయింది.

నీటి ఒత్తిడికి ఆ పైపులైన్ ప‌గిలిపోవ‌డంతో.. ఏకంగా ర‌హ‌దారి బ‌ద్ద‌లైపోయింది. అనంత‌రం క్ష‌ణాల్లోనే రోడ్డంతా జ‌ల‌మ‌యం అయింది. ర‌హ‌దారి బ‌ద్ద‌లైన స‌మ‌యంలో అటుగా స్కూటీపై వెళ్తున్న ఓ మ‌హిళ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

గాయాల‌పాలైన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పైపులైన్ ప‌గిలిన ధాటికి రోడ్డు బ‌ద్ద‌ల‌వ‌డాన్ని చూసి స్థానికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అధికారులు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు.