మహేష్ పక్కన ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న రోజా.. అందరు షాక్..!

టాలీవుడ్ కలల రాకుమారుడు మహేష్ బాబు పక్కన నటించాలని కోరిక ఎవరికి ఉండదు. స్టార్ హీరోయిన్స్ సైతం ఆయనతో ఒక్క సినిమా అయిన చేయాలని కలలు కంటున్నారు. ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న మహేష్ బాబు త్వరలో రాజమౌళితో పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉండనుందని, ఈ చిత్రంతో మహేష్ బాబు క్రేజ్ ఎల్లలు దాటనుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు పక్కన ఒక్క ఛాన్స్ ఇవ్వాలని సీనియర్ హీరోయిన్, ఏపీ మంత్రి కోరారు. ఆమె చేసి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రోజా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. పెళ్లి తర్వాత కెరీర్ కాస్త స్లో అయిన కూడా బుల్లితెరపై పలు షోలకి జడ్జిగా వ్యవహరిస్తూ మంచి క్రేజ్ దక్కించుకుంది. మంత్రి అయిన తర్వాత పూర్తిగా వెండితెర, బుల్లితెరకి దూరమైన రోజా..త్వరలో రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే రీఎంట్రీ ఇస్తే మాత్రం తాను మహేష్ బాబుతో కలిసి నటించాలని కోరుకుంటుంది. ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కు హాజరయిన రోజా అనంతరం మీడియాతో సరదాగా ముచ్చటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని నాకు కోరిక ఉందని, అయితే మహేష్ బాబుకు అమ్మ, అత్త పాత్రలలో మాత్రం తాను నటించనని స్పష్టం చేసింది.
మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోనని తెలియజేసింది. రోజాకి అక్క లేదా వదిన పాత్రలలో మాత్రమే తాను నటిస్తానంటూ రోజా పేర్కొంది. మరి రోజా చెప్పిన మాటలతో దర్శకులు ఆమె కోసం పాత్ర క్రియేట్ చేసి త్వరలో సంప్రదిస్తారా అని ముచ్చటించుకుంటున్నారు. రోజా రాజకీయాలలోకి వెళ్లిన ఆమెకి సినీ ఇండస్ట్రీతో మంచి రిలేషన్ ఉంది. అప్పుడప్పుడు పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతో భేటి అవతూనే ఉంటుంది. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరువాత ఆయన కంప్లీట్ గా రాజమౌళి సినిమాకే పూర్తిగా డేట్స్ కేటాయించనున్నాడు. ఈ సినిమా ఎన్నేళ్ల పాటు జరుగుతుందా అని అందరు ఆలోచనలు చేస్తున్నారు.