మునుగోడులో కాంగ్రెస్ నేత కారులో రూ. 19 లక్షలు లభ్యం

విధాత,నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతకు చెందిన ఓ కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి. గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్లే దారిలో ఈ వాహనాన్ని పోలీసులు ఆపి చెక్‌ చేయగా, డబ్బులు బయట పడ్డాయి. TS 07 FY 9333 బ్రీజా కారులో తరలిస్తున్న రూ.19 లక్షలను సీజ్ […]

  • By: krs    latest    Oct 18, 2022 7:23 AM IST
మునుగోడులో కాంగ్రెస్ నేత కారులో రూ. 19 లక్షలు లభ్యం

విధాత,నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతకు చెందిన ఓ కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి.

గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్లే దారిలో ఈ వాహనాన్ని పోలీసులు ఆపి చెక్‌ చేయగా, డబ్బులు బయట పడ్డాయి. TS 07 FY 9333 బ్రీజా కారులో తరలిస్తున్న రూ.19 లక్షలను సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నగదు పట్టుబడ్డ వాహనంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు, ఫ్లెక్సీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి సీజ్ చేసిన సంగతి తెలిసిందే.