తేడా కొట్టిన జగన్‌ కామెంట్స్‌.. పరిస్థితి చక్కదిద్దుతున్న సజ్జల!

విధాత: ఏయ్.. ఈ పాతిక మంది ఎమ్మెల్యేలు ఇల్లు కదలడం లేదు.. గడప దాటడం లేదు.. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనడం లేదు. వీళ్ల గ్రాఫ్ ఘోరంగా ఉంది.. టికెట్స్ ఇవ్వడం కష్టమే.. అంటూ ఎమ్మెల్యేలతో జగన్ పలికిన పలుకులు తేడాకొట్టాయి. మేము మాత్రమే పనికిమాలినోళ్ళమా.. మిగతా వారంతా వీరులా..సూరులా.. అంటూ ఆ ఎమ్మెల్యేలు పళ్ళు నూరారు.. ఇలా అనుకుంటే మా లీడర్ జగన్ ఎన్నిసార్లు బయటకు వచ్చారు.. ఎన్నిసార్లు జనాన్ని కలిశారు అన్న ప్రశ్నలూ ఉదయించాయ్. ఇవి […]

  • By: krs    latest    Sep 30, 2022 2:06 PM IST
తేడా కొట్టిన జగన్‌ కామెంట్స్‌.. పరిస్థితి చక్కదిద్దుతున్న సజ్జల!

విధాత: ఏయ్.. ఈ పాతిక మంది ఎమ్మెల్యేలు ఇల్లు కదలడం లేదు.. గడప దాటడం లేదు.. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనడం లేదు. వీళ్ల గ్రాఫ్ ఘోరంగా ఉంది.. టికెట్స్ ఇవ్వడం కష్టమే.. అంటూ ఎమ్మెల్యేలతో జగన్ పలికిన పలుకులు తేడాకొట్టాయి. మేము మాత్రమే పనికిమాలినోళ్ళమా.. మిగతా వారంతా వీరులా..సూరులా.. అంటూ ఆ ఎమ్మెల్యేలు పళ్ళు నూరారు..

ఇలా అనుకుంటే మా లీడర్ జగన్ ఎన్నిసార్లు బయటకు వచ్చారు.. ఎన్నిసార్లు జనాన్ని కలిశారు అన్న ప్రశ్నలూ ఉదయించాయ్. ఇవి హై కమాండ్ దృష్టికి చేరాయేమో.. వెంటనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి లైన్లోకి వచ్చారు. ఆ ఎమ్మెల్యేల కామెంట్స్ కు సర్దుబాటా అన్నట్లుగా కాస్త క్లారిటీ ఇస్తున్నట్లుగా జగన్ పెట్టిన వాతలకు కాస్తంత వెన్నపూస రాశారు.

ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగులు ఇవ్వడం..ఎమ్మెల్యేలు ఫీలవడం..ఇదంతా జనంలోనూ పార్టీ జనంలోనూ తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతున్నాయని అధిష్టానం గ్రహించిందేమో తెలియదు కానీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగులు ఇవ్వలేదని, జస్ట్ పార్టీ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే జరిగిందని అన్నారు.

గడప గడపకు కార్యక్రమం బాగా సాగుతోందని, ప్రజాదరణ కూడా బాగుందని వివరించారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా చూసి వక్రీకరించి టీడీపీ విమర్శలు చేస్తోందని దాన్నే ప్రచారం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. అందరూ ఒక ఫ్యామిలీగా కలసి పనిచేయాలనే జగన్ కోరుతూ వస్తున్నారని వివరించారు.

ఎమ్మెల్యేలకు వార్నింగులు అంటూ ఎల్లో మీడియా కూడా వార్తలు రాయడమేమిటని ఆయన ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఆరోజు ఎమ్మెల్యేల సమావేశం ప్రశాంతంగా సాగిందని.. లోటుపాట్లుంటే సరి చేసుకుంటున్నామని ఆయన చెబుతూ వచ్చారు. ఇదంతా చూస్తుంటే నష్ట నివారణ చర్యలు అన్నట్లుగానే ఉన్నాయని పార్టీ నాయకులు అంటున్నారు.