Samantha | ఏంటి సమంత.. విజయ్ దేవరకొండపై అంత ప్రేమ కురిపిస్తున్నావ్..!
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న సమంత సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఇందులో కథానాయకుడిగా నటించాడు. అటు విజయ్, ఇటు సమంతకి ఈ చిత్రం హిట్ చాలా ముఖ్యం కాగా, సినిమాని జనాలలోకి తీసుకెళ్లేందుకు చాలా కృషి చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగినన మ్యూజికల్ కాన్సర్ట్ వేడుకలో వేదిక మీద సమంత, విజయ్ దేవరకొండ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పడింది అని చెప్పాలి. […]

Samantha |
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న సమంత సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఇందులో కథానాయకుడిగా నటించాడు. అటు విజయ్, ఇటు సమంతకి ఈ చిత్రం హిట్ చాలా ముఖ్యం కాగా, సినిమాని జనాలలోకి తీసుకెళ్లేందుకు చాలా కృషి చేస్తున్నారు.
హైదరాబాద్ వేదికగా జరిగినన మ్యూజికల్ కాన్సర్ట్ వేడుకలో వేదిక మీద సమంత, విజయ్ దేవరకొండ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పడింది అని చెప్పాలి. సమంత స్లీవ్ లెస్ చోళీలో కొంచెం హాట్ గా కనిపించగా, విజయ్ దేవరకొండ తన షర్ట్ విప్పేసి ఆమెని ఎత్తుకొని గాలిలో గిరగిర తిప్పాడు.ఇది కాస్త ఓవర్‌గా ఉందనే నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ సినిమాకి మాత్రం మంచి ప్రమోషన్ దక్కింది.
ఇక ఈ వేడుక తర్వాత సమంత కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొని అమెరికా వెళ్లింది. అయితే ఈ అమ్మడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండపై తెగ ప్రేమ కురిపించింది. విజయ్ దేవరకొండకు ఆమె మిస్టర్ పర్ఫెక్ట్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు చాలా మంచోడు అని చెప్పుకొచ్చింది.
అందరూ అనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ రౌడీ, రెబల్ కాదని అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని పేర్కొంది. రౌడీ ఫెలో అని అందరు పిలుస్తుంటే నేను కూడా చాలా రెబల్ అని అనుకున్నాను. కానీ ఆయన గురించి తెలిసాక అభిప్రాయం మారింది. నిత్యం వ్యాయామం చేస్తాడు. వర్క్‌పై ఎంతో నిబద్ధతగా ఉంటాడు. విజయ్ దేవరకొండ గురించి తెలుసుకున్నాక నా అభిప్రాయ మారింది. అతనేంటో అర్ధమైందని సమంత స్పష్టం చేసింది.
ఇటీవల సమంత.. విజయ్ దేవరకొండకి చాలా సన్నిహితంగా మెలగడం, విజయ్ గురించి గొప్పగా మాట్లాడడం చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా అని అనే వాళ్లు లేకపోలేదు. సమంత మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లగా, అక్కడే మూడు నాలుగు నెలల పాటు ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తాను కమిటైన ప్రాజెక్ట్‌లు అన్నీ పూర్తి చేసిన సామ్ ఏడాది పాటు ఎలాంటి సినిమా చేయదని అంటున్నారు.