Samantha Vs Chittibabu | నేను మొదలెడితే తట్టుకోలేవ్‌.. సమంతకు నిర్మాత చిట్టిబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

Samantha విధాత: సమంత నిత్యం వార్తలలో ఉండాలని చేస్తుందో.. లేదంటే వేరే ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఆమె పేరు లేకుండా సోషల్ మీడియా నడవడం లేదు. ఏదో ఒక రూపంలో సమంత సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది. ఏదీ లేకపోతే.. చిట్టిబాబు అనే నిర్మాత మీడియా ముందుకు వచ్చి.. ఆమె గురించి అడ్డదిడ్డంగా ఏదో ఒకటి మాట్లాడి ఆమెను మళ్లీ వార్తలలోకి తీసుకొస్తున్నారు. చూస్తుంటే ఇదంతా కావాలనే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే.. సమంత […]

  • By: krs    latest    Apr 27, 2023 3:50 AM IST
Samantha Vs Chittibabu | నేను మొదలెడితే తట్టుకోలేవ్‌.. సమంతకు నిర్మాత చిట్టిబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

Samantha

విధాత: సమంత నిత్యం వార్తలలో ఉండాలని చేస్తుందో.. లేదంటే వేరే ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఆమె పేరు లేకుండా సోషల్ మీడియా నడవడం లేదు. ఏదో ఒక రూపంలో సమంత సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది.

ఏదీ లేకపోతే.. చిట్టిబాబు అనే నిర్మాత మీడియా ముందుకు వచ్చి.. ఆమె గురించి అడ్డదిడ్డంగా ఏదో ఒకటి మాట్లాడి ఆమెను మళ్లీ వార్తలలోకి తీసుకొస్తున్నారు. చూస్తుంటే ఇదంతా కావాలనే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఎందుకంటే.. సమంత పేరు మీడియాలో కాస్త డౌన్ అయిన ప్రతీసారి.. చిట్టిబాబు అనే సిట్టి నిర్మాత స్టూడియోలలో డిబెట్‌లకి, ఇంటర్వ్యూలకు దిగిపోతున్నారు. ఆ ఇంటర్వ్యూలలో ఆయన సమంతని ఏదో ఒకటి అనడం.. ఆ తర్వాత అంతా మాములే.

అయితే ఇదంతా కావాలనే చేస్తున్నారా? అని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. చిట్టిబాబు అనే నిర్మాత ఏదో ఫేమస్ అవడం కోసం ఇలా చేస్తున్నాడని అనుకుంటే.. అతడిని ఇన్‌డైరెక్ట్‌గా సమంత కూడా ప్రస్తావించడం ఇప్పుడు అనేక చర్చలకు తావిస్తోంది.

తాజాగా సమంత శాకుంతలం విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచింది.. ఈ క్రమంలో నిర్మాత చిట్టిబాబు ఓ మీడియాతో మాట్లాడుతూ.. సమంత పని అయిపోయిందని ఫేడ్‌వుట్‌ అయిందంటూ కామెంట్స్‌ చేశాడు. దీంతో ఈ విషయం సమంత వరకు చేరి ఆమె స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది.

రీసెంట్‌గా సమంత తన ఇన్‌స్టాలో చెవులలో జుట్టు ఎందుకు వస్తుంది అనేలా గూగుల్ సెర్చ్ చేస్తున్న పిక్‌ని పోస్ట్ చేసింది. నా గురించి ఏం తెలియకపోయినా.. అంతా తెలిసినట్లు మీడియా ముందు చెవులలో జుట్టు ఉన్నోళ్లు కలరింగ్ ఇస్తున్నారనేలా ఆమె పోస్ట్‌ని మీడియా అర్థం చేసుకుంది. అయితే సమంత పెట్టిన ఆ పోస్ట్ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.

ఈ విషయం చిట్టిబాబుకి తెలిసి.. సమంత నన్ను అంత మాట అందా? అంటూ ఫైర్ అయిపోయాడు. తన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను కౌంటర్స్ వేయడం మొదలెడితే.. సమంత తలకాయ ఎక్కడో పెట్టుకోవాలి. నా పేరు ప్రస్తావించకుండా ఏదో అందని నా దృష్టికి వచ్చింది.

అందుకని నేను కూడా ఇప్పుడామె పేరును ప్రస్తావించ దలుచుకోలేదు. ‘‘నేను శాకుంతలం సినిమాకు సంబంధించి మాత్రమే వ్యాఖ్యలు చేశాను. ఏదైనా ఉంటే, నేను మాట్లాడిన దానిలో నిజం లేదంటే.. దానిపై మాత్రమే వ్యాఖ్యలు చేయాలి. అలా కాకుండా.. ఇష్టం వచ్చినట్లుగా పోస్ట్ చేస్తే మాత్రం.. నేను కూడా కౌంటర్స్ వేయగలను.

నేను కౌంటర్స్ వేయడం మొదలు పెడితే.. ఆమె తట్టుకోలేదు. నేను మాట్లాడిన దానిపై మాట్లాడమనండి. అలా కాకుండా నా పేరు ప్రస్తావించి కనుక ఆమె పోస్ట్ చేసి ఉంటే లీగల్ యాక్షన్ తీసుకునేవాడిని..’’ అంటూ సమంతని చిట్టిబాబు హెచ్చరించాడు.

ఇదంతా చూసిన వారు.. పైన చెప్పుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిట్టిబాబు సమంత మనిషేనా? కావాలనే మీడియాలో ఇలా కామెంట్స్ చేస్తున్నాడా? ఏమో.. ఈ రోజులలో దేనిని నమ్మడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో చిట్టి, సమంతల కౌంటర్ వార్ వెనుక విన్న విషయం ఏమిటనేది.. ఆ పై వాడికే తెలియాలి.