ముగిసిన సానియా టెన్నిస్ కెరీర్.. దుబాయి చాంపియన్‌షిప్ తొలిరౌండ్‌లో ఓటమి
Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ ఓటమితో ముగిసింది. దుబాయిలో జరిగిన డబ్ల్యూటీఏ డ్యూటీ ఫ్రీ చాంపియన్ షిప్‌లో మంగళవారం సానియా జోడీ ఓటమిపాలైంది. టోర్నీలో సానియా అమెరికా భాగస్వామి మాడిసన్ కీస్‌తో కలిసి వరుస సెట్లలో సానియా-కీస్ జోడీ 4-6, 0-6తో రష్యాకు చెందిన వెర్నోకియా కుడెర్‌మెటోవా, లియుడ్‌మిలా శాంసోనోవా జంట చేతిలో ఓటమిపాలైంది. జనవరిలో సానియా రిటైర్‌మెంట్ 2003లో టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన సానియా.. స్విస్ లెజెండ్ మార్టినా మింగిస్‌తో […]

Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ ఓటమితో ముగిసింది. దుబాయిలో జరిగిన డబ్ల్యూటీఏ డ్యూటీ ఫ్రీ చాంపియన్ షిప్‌లో మంగళవారం సానియా జోడీ ఓటమిపాలైంది. టోర్నీలో సానియా అమెరికా భాగస్వామి మాడిసన్ కీస్‌తో కలిసి వరుస సెట్లలో సానియా-కీస్ జోడీ 4-6, 0-6తో రష్యాకు చెందిన వెర్నోకియా కుడెర్‌మెటోవా, లియుడ్‌మిలా శాంసోనోవా జంట చేతిలో ఓటమిపాలైంది.
జనవరిలో సానియా రిటైర్‌మెంట్
2003లో టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన సానియా.. స్విస్ లెజెండ్ మార్టినా మింగిస్‌తో కలిసి మూడు మహిళల డబుల్స్‌తో సహా ఆరు గ్రాండ్‌స్లామ్‌లను సాధించింది. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో మహేశ్ భూపతితో కలిసి 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్నది. ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణిగా నిలిచింది.
అంతకు ముందు సింగిల్స్‌లోనూ సత్తాచాటింది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. 2005లో యూఎస్ ఓపెన్స్‌లో నాల్గో రౌండ్‌కు చేరింది. ఈ ఏడాది జనవరిలో సానియా రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దుబాయిలో జరిగే టోర్నీ కెరీర్‌లో చివరిదని ప్రకటించిన విషయం విధితమే.