విధాత: కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో సెటైర్లు, రీల్స్, మీమ్స్ పేలుతున్నాయి. సహజంగానే ఆయన సబ్జెక్టుతో సంబంధం లేకుండా మాట్లాడుతారని ఆయనపై విపక్ష పార్టీల నేతలు విమర్శిస్తారు.
వారి ఆరోపణలకు తగ్గట్టుగానే ఆయన మాటలుంటాయి. అందుకే సంజయ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. సంజయ్ మాటలను చూసిన వాళ్లు కేఏ పాల్‌తో పోలుస్తుంటారు. కానీ ఆయన సంజయ్ కంటే చాలా మెరుగు అని, పాల్ మాట్లాడే ప్రతి మాటలోనూ స్పష్టత ఉంటుంది అంటున్నారు.
కొవిడ్‌ను తయారు చేయడం, కొవిడ్‌ను ఉత్పత్తి చేయడం: బండి pic.twitter.com/SiZT135y6K
— vidhaathanews (@vidhaathanews) February 3, 2023
ఇంతకీ సంజయ్ ఏమన్నారంటే.. కేంద్ర బడ్జెట్ ప్రపంచానికి ఆశాజనకంగా ఉన్నదట. ప్రపంచం గుర్తిస్తున్నదట. దీనికి నెటిజన్లు అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మానందం వీడియోను జత చేసి సెటైర్ వేస్తున్నారు.
కొవిడ్ తయారు చేయడం, కొవిడ్‌ను ఉత్పత్తి చేయడం అన్న మాటలను ఉటంకిస్తూ దానికి బ్రహ్మానందం నవ్వుతున్న వీడియోను పెట్టారు. డిజిటల్ లావాదేవీలు, రైల్వే బడ్జెట్‌కు కేంద్రం ఈసారి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులపై సంజయ్ మాటలు విన్నవారికి హాస్యం తెప్పించేలా ఉన్నాయి.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు