యంగ్ ప్రొడ్యూసర్ సెటైరికల్ రివ్యూ.. అవతార్ ఫ్యాన్స్ హర్ట్!

విధాత‌: మోస్ట్ ఎవైటెడ్ చిత్రం అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల‌లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ నుంచి ఘనమైన సమీక్షలను అందుకుంటుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భారీ యాక్షన్ దృశ్యాలతో పాటు భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టి చిత్రీకరించారు. ప్రపంచం మొత్తం ఈ విజువల్ వండర్ పై ప్రశంసలు కురిపిస్తోంది. అయితే అవతార్ 2 పై సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత.. భీమ్లా నాయక్, అల […]

యంగ్ ప్రొడ్యూసర్ సెటైరికల్ రివ్యూ.. అవతార్ ఫ్యాన్స్ హర్ట్!

విధాత‌: మోస్ట్ ఎవైటెడ్ చిత్రం అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల‌లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ నుంచి ఘనమైన సమీక్షలను అందుకుంటుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భారీ యాక్షన్ దృశ్యాలతో పాటు భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టి చిత్రీకరించారు.

ప్రపంచం మొత్తం ఈ విజువల్ వండర్ పై ప్రశంసలు కురిపిస్తోంది. అయితే అవతార్ 2 పై సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత.. భీమ్లా నాయక్, అల వైకుంఠపురములో, డీజే టిల్లు చిత్రాల నిర్మించిన యువ నిర్మాత మాత్రం ప్రతికూల వ్యాఖ్యలు చేశాడు. ఇది చ‌ల‌న చిత్రం కాదని ఏదో డాక్యుమెంటరీలా ఉందని వ్యాఖ్యానించాడు.

ఆయన ట్విట్టర్లో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ జేమ్స్ కామరూన్ మనకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మెరైన్ బయాలజీ డాక్యుమెంటరీని చూడాలనుకుంటే వెంటనే చూడండి. అది కూడా త్రీడీలో… మరీ ముఖ్యంగా కామెరూన్‌ది కాబట్టి.

ఈ చిత్రం విజువల్ స్పెక్టాకిల్, మాస్టర్ క్రాఫ్ట్, బ్లాక్ బస్టర్ అని మాత్రమే చెప్పడానికి మనకు అనుమతి ఉంది. మరి ఏమైనా…నా… వి అంగీకరించడు.. అంటూ కొన్ని తమాషా ఎమోజీలను షేర్ చేశాడు. నీటి అడుగున ఒక సరికొత్త ప్రపంచంపై డాక్యుమెంటరీ ఇలా తీసినా కానీ..

ఇది ఒక విజువ‌ల్‌ వండర్ అని తనదైన సెటైరికల్ వాయిస్‌‌లో చెప్పాడు. అయితే అవతార్ ప్రేమికులకు ఇది నచ్చడం లేదు. ఆయన వ్యాఖ్యలకు చాలామంది నెటిజ‌న్ల‌ నుండి ప్రతికూలత ఎదురవుతోంది.

వీటిపై నాగ‌ వంశీ మాత్రం ఏమీ ప్రతిస్పందించడం లేదు. అలాగని ట్వీట్ ను కూడా తొలగించలేదు. ప్రస్తుతం అయిన టిల్లు స్క్వేర్ చిత్రం చేస్తున్నాడు. అవతార్ ఫ్యాన్స్ ఆయనపై విరుచుకుపడుతూ మీరు తీసే చెత్త సినిమాల కన్నా పర్వాలేదు. ఇలాంటి సినిమాలు నువ్వు ప్రొడ్యూస్ చేయి చూద్దాం అంటున్నారు.

ప్రస్తుతం అతను మహేష్ బాబు త్రివిక్రమ్‌తో భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పేరుకు ఈయ‌నే అయినా ఆయ‌న పెదనాన్న రాధాకృష్ణ మొత్తం మెయిన్ నిర్మాత. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో హడావుడి మాత్రం నాగవంశీదే.