ప‌ల్నాడులో 144 సెక్ష‌న్‌.. వైసీపీ దౌర్జ‌న్య‌కాండ‌.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

విధాత‌: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం నివురు గప్పిన నిప్పులా ఉన్నది. నిన్న వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యాలయంతో పాటు పార్టీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో టీడీపీ కార్యాలయం కాలిపోయింది. టీడీపీ నేతలకు చెందిన 10కి పైగా వాహనాలు ధ్వంసం కాగా, 2 వాహనాలకు నిప్పుపెట్టారు. మాచర్ల పట్టణంలో అదనపు పోలీసులు మోహరించారు. పోలీసులు పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి […]

ప‌ల్నాడులో 144 సెక్ష‌న్‌.. వైసీపీ దౌర్జ‌న్య‌కాండ‌.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

విధాత‌: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం నివురు గప్పిన నిప్పులా ఉన్నది. నిన్న వైసీపీ శ్రేణుల దౌర్జన్యకాండతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యాలయంతో పాటు పార్టీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి.

వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో టీడీపీ కార్యాలయం కాలిపోయింది. టీడీపీ నేతలకు చెందిన 10కి పైగా వాహనాలు ధ్వంసం కాగా, 2 వాహనాలకు నిప్పుపెట్టారు.

మాచర్ల పట్టణంలో అదనపు పోలీసులు మోహరించారు. పోలీసులు పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి రాత్రి మాచర్లలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. తగలబడిన కార్యాలయం, ధ్వంసమైన ఆస్తులతో టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.