Putta Madhu: బిడ్డ, కోడలితో సమానంగా.. పేదింటి ఆడబిడ్డకు శ్రీమంతం చేసిన పెద్దపల్లి జ‌డ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ దంపతులు

ఆదర్శం చాటుకున్న  రాజకీయ నాయకులకు ఓట్ల సమయంలోనే ప్రజలు గుర్తుకు రావడం, వారి అవసరాలు తీర్చడం సర్వసాధారణం. కానీ ఈయన మాత్రం అందుకు భిన్నం. మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆమె, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన, భార్యాభర్తలు ఇరువురు ప్రజలకు అందుబాటులో.. ప్రజల మధ్యే ఉంటూ ప్రజలే మా బలం, మా బలగం అని చాటుకుంటున్నారు. విధాత బ్యూరో, కరీంనగర్: మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇన్‌చార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, మున్సిపల్‌ […]

  • Publish Date - April 3, 2023 / 12:47 AM IST
  • ఆదర్శం చాటుకున్న

రాజకీయ నాయకులకు ఓట్ల సమయంలోనే ప్రజలు గుర్తుకు రావడం, వారి అవసరాలు తీర్చడం సర్వసాధారణం. కానీ ఈయన మాత్రం అందుకు భిన్నం. మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆమె, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన, భార్యాభర్తలు ఇరువురు ప్రజలకు అందుబాటులో.. ప్రజల మధ్యే ఉంటూ ప్రజలే మా బలం, మా బలగం అని చాటుకుంటున్నారు.

విధాత బ్యూరో, కరీంనగర్: మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇన్‌చార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ దంపతులు మరోసారి తమ మానవతను చాటుకున్నారు.

ఆదివారం మంథని పట్టణంలోని రాజగృహాలో తమ కూతురు మౌమిత, కోడలు కుశాలి శ్రీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఇరువురితో పాటు ఓ పేదింటి ఆడబిడ్డకు ఆదే వేదికపై పుట్ట దంపతులు శ్రీమంతం చేయడం విశేషం.

మంథని మండలం గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన బీఆర్ఎస్‌ నాయకుడు గోసిక శ్రీనివాస్‌ మృతి చెందగా ఆయన కూతురు వివాహానికి గతంలో సాయం చేసిన పుట్ట దంపతులు ఈనాడు ఆమెకు ఒకే వేదికపై బిడ్డ, కోడలితో కలిపి శ్రీమంతం చేశారు.

సంప్రదాయం ప్రకారం తమ బిడ్డ, కోడలుకు ఎలా పూలు, పండ్లు, వస్రాలు, ఇతర కానుకలు పెట్టి శ్రీమంతం చేశారో అదే రీతిలో గోసిక శ్రీనివాస్‌ కూతురు సోనీకి కూడా శ్రీమంతం చేసి తాము పేదల మనుషులమని నిరూపించుకున్నారు.