Sengol । కొత్త పార్లమెంటులో ఉంచే ‘సెంగోల్‌’ కథాకమామిషు ఏమనగా

విధాత‌: నూతన పార్లమెంటులో ‘సెంగోల్‌’ (Sengol)ను ప్రముఖంగా ప్రతిష్ఠించనున్నట్టు హోం మంత్రి అమిత్‌ షా బుధవారం నాటి మీడియా సమావేశంలో వెల్లడించారు. అసలు ఈ సెంగోల్‌ అంటే ఏమిటి? తమిళంలోని సెమ్మాయి (ప్రతిష్ఠాత్మక) అనే పదం నుంచి వచ్చిందే సెంగోల్‌. అంటే రాజదండం అని అర్థం. దీనిని స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు బ్రిటిష్‌వాళ్లు అధికార మార్పిడిని పురస్కరించుకుని బహూకరించారు. ఇదీ సెంగోల్‌ చరిత్ర అధికార మార్పిడిని సూచించేందుకు ఏం చేయాలని అప్పటి బ్రిటిష్‌ […]

Sengol । కొత్త పార్లమెంటులో ఉంచే ‘సెంగోల్‌’ కథాకమామిషు ఏమనగా

విధాత‌: నూతన పార్లమెంటులో ‘సెంగోల్‌’ (Sengol)ను ప్రముఖంగా ప్రతిష్ఠించనున్నట్టు హోం మంత్రి అమిత్‌ షా బుధవారం నాటి మీడియా సమావేశంలో వెల్లడించారు. అసలు ఈ సెంగోల్‌ అంటే ఏమిటి? తమిళంలోని సెమ్మాయి (ప్రతిష్ఠాత్మక) అనే పదం నుంచి వచ్చిందే సెంగోల్‌. అంటే రాజదండం అని అర్థం. దీనిని స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు బ్రిటిష్‌వాళ్లు అధికార మార్పిడిని పురస్కరించుకుని బహూకరించారు.

ఇదీ సెంగోల్‌ చరిత్ర

అధికార మార్పిడిని సూచించేందుకు ఏం చేయాలని అప్పటి బ్రిటిష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటెన్‌.. నెహ్రూను అడిగారట. దీంతో ఆయన భారతదేశపు చివరి గవర్నర్‌ జనరల్‌ సీ రాజగోపాలాచారిని సలహా కోరారట. రాజగోపాలాచారి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా తోరపల్లికి చెందినవారు. ఆయన బాగా ఆలోచించి.. చోళ వంశీయుల్లో అధికార మార్పిడి సందర్భంగా అందజేసే ‘సెంగోల్‌’ (రాజదండం) మార్పడి జరగాలని సూచించారు.

ధర్మానికి కట్టుబడి పాలన సాగించాలని బాధ్యత అప్పగిస్తూ ఈ రాజదండాన్ని చోళ వంశీయులు అందించేవారు. ఇదే తరహా రాజదండాన్ని చెన్నైకి చెందిన నగల తయారీదారు వుమ్మడి గంగారు చెట్టి రూపొందించారు. 1947 ఆగస్ట్‌ 14వ తేదీన దీనిని నెహ్రూకు అందించారు. సెంగోల్‌ 5 అడుగుల పొడవు ఉంటుంది. దానం దండంపైన నంది బొమ్మ చెక్కి ఉంటుంది. న్యాయానికి లేదా నిష్పాక్షికతకు నందిని చిహ్నంగా భావిస్తారు.