మెదక్ జిల్లా TUWJ అధ్యక్షుడిగా శంకర్ దయాళ్ చారి
ప్రధాన కార్యదర్శిగా సంతోష్ విధాత, మెదక్ బ్యూరో: టీయూడబ్లుజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు శుక్రవారం సాయంత్రం మెదక్‌లోని టీఎన్జీవో భవన్‌లో ఎన్నికలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ల ఉప సంహరణ అనంతరం ఓకే అభ్యర్థి సంతోష్ పోటీలో మిగలడంతో అతను ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎన్నికల్లో మొత్తం 172 ఓట్లు పోలవగా శంకర్ దయాళ్ చారికి 134 ఓట్లు, నర్సింహ చారికి 29 […]

ప్రధాన కార్యదర్శిగా సంతోష్
విధాత, మెదక్ బ్యూరో: టీయూడబ్లుజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు శుక్రవారం సాయంత్రం మెదక్‌లోని టీఎన్జీవో భవన్‌లో ఎన్నికలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ల ఉప సంహరణ అనంతరం ఓకే అభ్యర్థి సంతోష్ పోటీలో మిగలడంతో అతను ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు.
అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎన్నికల్లో మొత్తం 172 ఓట్లు పోలవగా శంకర్ దయాళ్ చారికి 134 ఓట్లు, నర్సింహ చారికి 29 ఓట్లు, శ్యామ్‌కు 7 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు నోటాకు పడగా, ఒక ఓటు చెల్లలేదు. ఈ నేపథ్యంలో శంకర్ దయాళ్ చారి 105 ఓట్ల మెజారిటీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు.
ఎన్నికల అధికారిగా మిన్పూర్ శ్రీనివాస్ వ్యవహరించగా సహా అధికారులుగా మోహన్ రాజ్,తిమ్మన్నగారి శ్రీదర్ లు ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా నాగరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా బొందుగుల నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.