RC15: శంకర్-రామ్ చరణ్ చిత్రం ఫొటోస్‌ లీక్‌.. తలలు పట్టకుంటున్న యూనిట్‌!

విధాత: ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన RRR మూవీలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ క‌లిసి అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ పాత్ర‌ల్లో న‌టించారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులైన అల్లూరి, కొమ‌రంల‌ను ఫిక్ష‌న‌ల్ పాత్ర‌ల్లో చూపించేలా రాసుకున్న స్టోరీ RRR. ఇక ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ నిడివే ఎక్కువ‌. ఎన్టీఆర్ పాత్ర నిడివి త‌క్కువ‌. దాంతోనే ప‌లు అవార్డుల విషయంలో కూడా చ‌ర‌ణ్‌కి ఉత్త‌మ హీరో, ఎన్టీఆర్‌కి ఉత్త‌మ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ త‌రహాలో లెక్క‌ […]

  • By: krs    latest    Dec 25, 2022 7:31 AM IST
RC15: శంకర్-రామ్ చరణ్ చిత్రం ఫొటోస్‌ లీక్‌.. తలలు పట్టకుంటున్న యూనిట్‌!

విధాత: ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన RRR మూవీలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ క‌లిసి అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ పాత్ర‌ల్లో న‌టించారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులైన అల్లూరి, కొమ‌రంల‌ను ఫిక్ష‌న‌ల్ పాత్ర‌ల్లో చూపించేలా రాసుకున్న స్టోరీ RRR. ఇక ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ నిడివే ఎక్కువ‌. ఎన్టీఆర్ పాత్ర నిడివి త‌క్కువ‌. దాంతోనే ప‌లు అవార్డుల విషయంలో కూడా చ‌ర‌ణ్‌కి ఉత్త‌మ హీరో, ఎన్టీఆర్‌కి ఉత్త‌మ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ త‌రహాలో లెక్క‌ క‌డుతున్నారు.

ఇక విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ శంకర్‌తో RC15 పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే ఇది ఆయనకు 50వ చిత్రం.. దీంతో ఈ సినిమాపై భారీగా పెట్టుబడి పెడుతున్నాడు.

ఇప్పటికే కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ పై దిల్ రాజు రెండు వందల యాభై కోట్లకి పైగా బడ్జెట్ పెట్టినట్లుగా టాక్ నడుస్తుంది. ‘వారసుడు’ సినిమాకి అంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే విజయ్‌కి కోలీవుడ్‌లో తప్పితే.. మిగతా చోట్ల పెద్దగా క్రేజ్ లేదు. అలాంటిది RRRతో పాన్ ఇండియా వైడ్ నుండి పాన్ వరల్డ్ స్టార్‌గా మారుతున్న రామ్ చరణ్ పై మరింత పెట్టుబడి పెట్టడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే ‘వారసుడు’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కంటే.. తలపెట్టిన ఏ చిత్రాన్నైనా అత్యంత భారీ స్థాయిలో తీసే శంకర్‌కు మరింత బడ్జెట్ కేటాయించక తప్పదు. అందులోనూ ఇది ఆయనకు 50వ చిత్రం కూడానూ. అందుకే.. దిల్ రాజు ఈ చిత్రానికి 500 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నాడని అంటున్నారు. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ఒకటి వింటేజ్ లుక్ కాగా.. ఆ పాత్రకు జోడీగా అంజలి నటిస్తోంది. ఆ పాత్రకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి.

ఇక పెద్ద వయసు ఉన్న రామ్ చరణ్ ఇందులో నత్తిగా నటిస్తున్నాడట. అలాగే మరో పాత్రలో రామ్ చరణ్ ఒక పార్టీ పెట్టి.. ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని.. అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ అని తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో మరో స్టేట్ ముఖ్యమంత్రి పాత్రలో మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించనున్నాడనేది తాజా సమాచారం. శంకర్ చిత్రాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సామాజిక అంశంపై రూపొందుతాయి. ఈ చిత్రంలో కూడా పాలిటిక్స్ ఎలా ఉండాలి? ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? ఎన్నికల కమిషనర్ విధులు ఏమిటి అనే అంశాలను సినిమాలో టచ్ చేసినట్లుగా టాక్.

నేటి రాజకీయ వ్యవస్థకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి నేటి రాజకీయాలకు అలవాటు పడలేక పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు.. మరలా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. ఇలా తండ్రి పార్టీ పెట్టి ఆపేయడం చరణ్‌కు చాలా బాధ కలిగించింది అంటారు. ప్రస్తుతం చరణ్ బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నడుపుతున్నాడు. ఈ చిత్రంలో జనసేన సిద్ధాంతాలు కూడా ఉంటాయని అంటున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో పార్టీ పేరు కూడా బయటకు వచ్చింది. అభ్యుదయ పార్టీ పేరుతో ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమంత్రి కనిపించనున్నాడు.

రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద గోదావరి నది నడిబొడ్డున ఉన్న ఇసుక తిన్నెలపై భారీ సెట్లు వేసి.. ఈ రాజకీయ అంశాలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుపుతున్నారు. ఆ సెట్లో రామ్ చరణ్ పొలిటికల్ మీటింగ్ పెట్టి ఉన్నాడు. ఆ ప్రాంతమంతా అభ్యుదయ పార్టీకి ఓటేయండి.. ట్రాక్టర్ గుర్తునే గెలిపించండి అనే కటౌట్స్ ఉన్నట్లుగా తాజాగా కొన్ని ఫొటోలు లీకయ్యాయి. ఈ షూటింగ్‌లో పలువురు జూనియర్ ఆర్టిస్ట్ లు, పార్టీ కార్యకర్తలు కనిపించనున్నారు.

సభా ప్రాంగణం నిండా జనాలున్నారు. మొత్తానికి శంకర్ ఏ చిత్రం తీసినా లీకుల గొడవ తప్పేలా లేదు. ఆయన గత చిత్రాలు కూడా లీక్ అయ్యాయి ఇప్పటికే నత్తి ఉండే పెద్ద రామ్ చరణ్, అంజలిల ఫోటోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన ఫొటోలు లీకయ్యాయి. దీంతో అసలేం జరుగుతోంది అంటూ.. చిత్ర యూనిట్ తలపట్టుకుంటోంది.