బాలీవుడ్‌కి ప్రాణం పోసిన షారూఖ్ ఖాన్.. ఆయన సినిమాలకి ఏకంగా రూ.2వేల కోట్లు

ఒకప్పుడు ఖాన్ హీరోలు బాలీవుడ్ ఖ్యాతిని ఎంతగా పెంచారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వారి నుండి అలరించే సినిమాలు రావడం లేదు. బాహుబలి సినిమా తర్వాత సౌత్ సినిమా స్థాయి పెరగగా, బాలీవుడ్ హవా తగ్గింది. సౌత్‌లో ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘మేజర్’, ‘కార్తీకేయ 2’ , ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఆ రేంజ్‌ని అందుకోవడం బాలీవుడ్‌కి గగనంగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన బ్రహ్మాస్త్ర చిత్రం కనీసం రూ.500 కోట్లు దాటలేకపోయింది. ‘గంగూబాయి కథియావాడి’, ‘దృశ్యం2’, వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరచాయి. ఇక అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ నటించిన ‘రామ్ సేతు’, హృతిక్ రోషన్ నటించిన ‘విక్రమ్ వేద’ కూడా బాలీవుడ్ ఖ్యాతిని పెంచలేకపోయాయి.
బాలీవుడ్ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతున్న నేపథ్యంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఊపరి పోసాడు. ఒకే ఏడాది రెండు బడా సినిమాలతో అదరగొట్టాడు. ఆయన రెండు చిత్రాలు రూ.వెయ్యికోట్ల కలెక్షన్లతో ఇండియా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయి. 2023లో పటాన్ మూవీ వచ్చిన షారూఖ్ ఖాన్ రూ.1,050 కోట్లు కలెక్ట్ చేశారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ చిత్రం కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.1,011 కోట్ల వసూళ్లు రాబట్టి షారూఖ్ సత్తా ఏంటో చూపించింది.
జవాన్ చిత్రం షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ లో రూపొందగా, ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు. విడుదలైన ప్రతి చోట కూడా ఈ మూవీ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇలా రెండు భారీ సినిమాలతో రూ.2000 కోట్ల కలెక్షన్లు షారుఖ్ ద్వారా బాలీవుడ్ బాక్సాఫీస్‌కి రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.ఇక సన్నీడియోల్ నటించిన గదర్ 2 రూ.680 కోట్లకు పైగా బాక్పాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్‌కి కొంత ఉపశమనం అందించింది. ఇక ‘ది కేరళ స్టోరీ’ కూడా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొత్తానికి ‘పఠాన్’తో బాలీవుడ్ విజయ ప్రస్థానం మొదలు కాగా, పఠాన్, జవాన్, గదర్2 చిత్రాలు మొత్తంగా రూ.2700 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి.