ఆకర్షణీయంగా న‌ల్ల‌గొండ‌ శిల్పారామం నిర్మాణం

విధాత: న‌ల్ల‌గొండ‌లో నిర్మించ తలపెట్టిన శిల్పారామం ఆకర్షణీయంగా ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని శిల్పారామం ప్రత్యేక అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ జి.కిషన్ రావు సూచించారు. శనివారం హైదరాబాద్ టూరిజం కార్యాలయంలో నల్గొండ మున్సిపాలిటీ కమిషనర్ రమణాచారితో శిల్పారామం ఏర్పాటుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ ఇప్పటికే వివిధ చోట్ల ఏర్పాటైన శిల్పారామాలను పరిశీలించి, కొత్తగా అవసరమైన మార్పులు చేర్పులతో న‌ల్ల‌గొండ‌లోని శిల్పారామం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కమిషనర్ కు […]

  • Publish Date - November 26, 2022 / 01:41 PM IST

విధాత: న‌ల్ల‌గొండ‌లో నిర్మించ తలపెట్టిన శిల్పారామం ఆకర్షణీయంగా ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని శిల్పారామం ప్రత్యేక అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ జి.కిషన్ రావు సూచించారు. శనివారం హైదరాబాద్ టూరిజం కార్యాలయంలో నల్గొండ మున్సిపాలిటీ కమిషనర్ రమణాచారితో శిల్పారామం ఏర్పాటుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ ఇప్పటికే వివిధ చోట్ల ఏర్పాటైన శిల్పారామాలను పరిశీలించి, కొత్తగా అవసరమైన మార్పులు చేర్పులతో న‌ల్ల‌గొండ‌లోని శిల్పారామం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు.