Sania Mirza | సానియా రిటైర్మెంట్.. భర్త రాలేదేం.!
విధాత: ఒకనాటి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania mirza) తన ఇరవయ్యేళ్ళ కెరీర్ కు ముగింపు పలికింది..తాను ఇష్టపడిన క్రీడ.. అంతర్జాతీయ వేదికల మీద తనను రాణిలా నిలబెట్టిన క్రీడా నుంచి ఇప్పుడు దూరం అవ్వాల్సి వచ్చింది.. ఫిట్నెస్ కాపాడుకోలేకపోవడం.. టోర్నీల్లో సరిగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోవడం.. కొత్త తరానికి మార్గం ఇవ్వాల్సి వచ్చిన తరుణంలో అనివార్యంగా ఆమె తన రిటైర్మెంట్ ప్రకటించారు. ఈమేరకు హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తదితరులు సమక్షంలో ఆమె కన్నీటి […]

విధాత: ఒకనాటి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania mirza) తన ఇరవయ్యేళ్ళ కెరీర్ కు ముగింపు పలికింది..తాను ఇష్టపడిన క్రీడ.. అంతర్జాతీయ వేదికల మీద తనను రాణిలా నిలబెట్టిన క్రీడా నుంచి ఇప్పుడు దూరం అవ్వాల్సి వచ్చింది.. ఫిట్నెస్ కాపాడుకోలేకపోవడం.. టోర్నీల్లో సరిగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోవడం.. కొత్త తరానికి మార్గం ఇవ్వాల్సి వచ్చిన తరుణంలో అనివార్యంగా ఆమె తన రిటైర్మెంట్ ప్రకటించారు.
ఈమేరకు హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తదితరులు సమక్షంలో ఆమె కన్నీటి సుడుల నడుమ రాకెట్ ను విడిచారు. అయితే ఈ వీడ్కోలు కార్యక్రమంలో భర్త, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మాత్రం ఎటెండ్ కాలేదు. వాస్తవానికి ఈ దంపతుల మధ్యచాన్నాళ్లుగా పొరపొచ్చాలు ఉన్నాయని, విడిపోతున్నారని..ఇప్పటికే దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.
దీంతో ఈమె వీడ్కోలు కార్యక్రమంలో షోయబ్ మాలిక్ పాల్గొనక పోవడంతో విభేదాలు..నిజమే అన్న ప్రచారం సాగుతోంది. సానియా మీర్జా కెరీర్ లోనే కీలక ఘటం వీడ్కోలు కార్యక్రమం. అలాంటి కార్యక్రమంలో భర్త షోయబ్ మాలిక్ లేకపోవడంతో నెటిజన్లు పలు కామెంట్లు విసురుతున్నారు.
పాకిస్తాన్ కు చెందిన షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సమయంలో సానియా మీర్జాను దేశవ్యాప్తంగా జనాలు విమర్శించారు. ఆమెకు ఇండియాలో భర్త దొరకలేదా.. పాకిస్తాన్ వ్యక్తి కావాల్సి వచ్చిందా.. పాకిస్తాన్ కు కోడలుగా వెళ్లాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించారు.
తమ భార్యాభర్తల బంధం మీద కూడా ఆమధ్య సానియా మీర్జా సందేహాస్పదంగా కామెంట్స్ చేశారు. తాను కుటుంబంతో ఇబ్బంది పడుతున్నట్లు ఆమధ్య ట్వీట్స్ కూడా సానియా పోస్ట్ చేసారు. మొత్తానికి ఈ పాకిస్తాన్ కోడలు దేశాన్ని వీడి ఇక్కట్ల పాలయ్యారని అంటున్నారు.