పెళ్లితో ఒక్కటైన సిద్ధార్‌ మల్హోత్ర-కియారా అద్వానీ.. నెట్టింట ఫొటోలు వైరల్‌..!

Sidharth Kiara Wedding | బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ మల్హోత్ర - కియారా అద్వానీ పెళ్లితో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో మంగళవారం బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలారోజుల నుంచి స్టార్‌జోడీ ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా షేర్‌ చేశారు. ‘ఇప్పుడు మా బంధం పర్మినెంట్‌గా బుకింగ్ అయింది. మీ ఆశీర్వాదాలు కావాలి’ అంటూ సిద్ధార్థ్‌ ఫొటోలకు క్యాప్షన్‌ జోడించాడు. […]

  • Publish Date - February 8, 2023 / 02:41 AM IST

Sidharth Kiara Wedding | బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ మల్హోత్ర – కియారా అద్వానీ పెళ్లితో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో మంగళవారం బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలారోజుల నుంచి స్టార్‌జోడీ ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా షేర్‌ చేశారు. ‘ఇప్పుడు మా బంధం పర్మినెంట్‌గా బుకింగ్ అయింది. మీ ఆశీర్వాదాలు కావాలి’ అంటూ సిద్ధార్థ్‌ ఫొటోలకు క్యాప్షన్‌ జోడించాడు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక జరగ్గా.. ఇందుకు సంబంధించి ఫొటోలు వైరల్‌గా మారాయి.

బాలీవుడ్‌ స్టార్‌ జోడీకి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లిలో కియారా పింక్‌ గోల్డెన్‌ కలర్‌ లెహంగాలో మెరిసిపోయింది. అలాగే గ్రీన్‌ కలర్‌ హెవీ జ్యువెలరీ, సిల్వర్‌ కలర్‌ బ్యాంగిల్స్‌తో అందంగా ముస్తాబైంది. సిద్ధార్థ్‌ గోల్డెన్‌ కలర్‌ షేర్వానీలో మెరిసిపోయాడు. పెళ్లి తర్వాత ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటున్న ఫొటోలు షేర్‌ చేయగా.. వైరల్‌గా మారాయి. పెళ్లి వేడుకకు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, అతని భార్య మీరా కపూర్, జూహిచావ్లా, కరణ్‌ జోహర్‌, టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అతితక్కువ మంది బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరగ్గా.. త్వరలోనే ముంబై, ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక పెళ్లికి హాజరైన అతిథులకు సూర్యాఘర్ ప్యాలేస్‌లో దేశ, విదేశాలకు చెందిన పలురకాల పసందైన వంటకాలను రుచి చూపించారు.

Latest News