Sitara:టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ టైం దొరికితే చాలా ఫ్యామిలీతో విహార యాత్రలకి వెళుతుంటాడు.లండన్, అమెరికాతో పాటు ఇతర దేశాలు చుట్టేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ లండన్‌లో ఉండగా, అక్కడ నుండి సితార తన సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ ఇస్తూ వస్తుంది. తాజాగా సితార ఘట్టమనేని తన వెకేషన్ ఫోటోలు పంచుకోగా ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రెండీ వేర్లో సూపర్ […]
Sitara:టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ టైం దొరికితే చాలా ఫ్యామిలీతో విహార యాత్రలకి వెళుతుంటాడు.లండన్, అమెరికాతో పాటు ఇతర దేశాలు చుట్టేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ లండన్‌లో ఉండగా, అక్కడ నుండి సితార తన సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ ఇస్తూ వస్తుంది.
తాజాగా సితార ఘట్టమనేని తన వెకేషన్ ఫోటోలు పంచుకోగా ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రెండీ వేర్లో సూపర్ స్టైలిష్ గా ఉన్న సితారని చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. సితార టాలీవుడ్ ఎంట్రీకి ఇంకెంతో సమయం లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఒక్క సినిమా చేయకపోయిన కేవలం 11 ఏళ్లకే సితార సెలబ్రిటీ హోదా దక్కించుకుంది. సంపాదనలో కూడా ఈ చిన్నారి దూసుకుపోతుంది. ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గాఎంపికైన సితార.. న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో హోర్డింగ్స్ పైకి ఎక్కింది.
ఈ అరుదైన ఘనత తన కూతురికి దక్కడం పట్ల మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ యాడ్‌కి సితార కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుండగా, ఆ మొత్తాన్ని తాను చారిటీకి ఇచ్చినట్టు తెలియజేసింది. చిన్న వయస్సులోనే సితార ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
సితార ఇంత చిన్న వయస్సులో అంత పాపులర్ కావడానికి కారణం ఆమె టాలెంట్ కూడా. సితార తన సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు , పాటలు పాడుతున్న వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలానే సోషల్ అవేర్నెస్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది.
కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార ఇన్‌స్టాలో మిలియన్స్ ఫాలోవర్స్ కలిగి ఉంది.యానీ మాస్టర్ వద్ద సితార డాన్సులు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తుండగా, ఈ మధ్య సారంగదరియా అనే పాటలకి లంగాఓణీలో డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది.