Godavari Express | గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు.. కారణం ఏంటంటే..?
Godavari Express | ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ చిన్న ఘటన జరిగినా ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా ఏసీ కోచ్‌లో పొగలు వచ్చాయి. దీంతో రైలును నిలిపివేశారు. ఉన్నట్టుండి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, థర్డ్ ఏసీ కోచ్ బీ4లో ఉన్న క్యాబిన్ కంట్రోల్ ప్యానెల్‌లోకి ఎలుక దూరింది. దీంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. […]

Godavari Express |
ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ చిన్న ఘటన జరిగినా ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా ఏసీ కోచ్‌లో పొగలు వచ్చాయి. దీంతో రైలును నిలిపివేశారు.
ఉన్నట్టుండి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, థర్డ్ ఏసీ కోచ్ బీ4లో ఉన్న క్యాబిన్ కంట్రోల్ ప్యానెల్‌లోకి ఎలుక దూరింది.
దీంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, వెంటనే రైలును నిలిపివేసినట్లు ప్రయాణికులు పేర్కొన్నారు. పొగకు కారణాలు తెలియకపోవడంతో ప్రయాణికులు బోగీ నుంచి కిందకు దిగిపోయారు.
పొగలను గుర్తించిన స్మోక్ అలారం మోగడంతో రైలును నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. రైల్వే సిబ్బంది దాదాపు20 నిమిషాలు పాటు శ్రమించి ప్యానెల్ బోర్డులో చిక్కుకున్న ఎలుకను తొలగించారు. ఆ తర్వాత రైలు మళ్లీ విశాఖపట్నానికి బయలుదేరింది. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.