కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్.. పట్టుబడిన రూ.34లక్షల 170 కిలోల గంజాయి
ఉప సర్పంచ్ ముఠా అరెస్ట్ కారు, బొలేరో, సెల్‌ఫోన్లు స్వాధీనం ఏపీలో కొనుగోలు… వరంగల్ తరలింపు… గుట్టు బహిరంగమైన ఉదంతం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న గ్రామ ఉప సర్పంచ్ సహా నలుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. రాయినేని శంకర్ 41, గొరుకొత్తపల్లి, రేగొండ మండలం, భూపాలపల్లి జిల్లా, 2. ముసిక లక్ష్మణ్ 44, […]

- ఉప సర్పంచ్ ముఠా అరెస్ట్
- కారు, బొలేరో, సెల్‌ఫోన్లు స్వాధీనం
- ఏపీలో కొనుగోలు… వరంగల్ తరలింపు…
- గుట్టు బహిరంగమైన ఉదంతం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న గ్రామ ఉప సర్పంచ్ సహా నలుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. రాయినేని శంకర్ 41, గొరుకొత్తపల్లి, రేగొండ మండలం, భూపాలపల్లి జిల్లా, 2. ముసిక లక్ష్మణ్ 44, నీరుకుళ్లు గ్రామ ఉపసర్పంచ్, ఆత్మకూర్ మండలం, వరంగల్ జిల్లా, 3.మాట మహేష్ 28, బండారుపల్లి గ్రామం, ములుగు జిల్లా, 4.గండికోట సతీష్ 38, పస్రా, ములుగు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరి నుండి రూ.34లక్షల విలువైన 170 కిలోల గంజాయి ఒక కారు, ఒక బోలెరో, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
(Ganjai)గంజాయి ముఠా అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డిసిపి పి.కరుణాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అరెస్ట్ చేసిన నిందితుల్లో రాయినేని శంకర్, నీరుకుళ్ల గ్రామ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ ఆంధ్రరాష్ట్రంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
వీరిద్దరూ మిగతా ఇద్దరు నిందితులతో కల్పి ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నంలోని నూకరాజు (ప్రస్తుతం పరారీలో వున్నాడు) ద్వారా 170కిలోల గంజాయిని కోనుగోలు చేసి, రెండు కిలోల ప్యాకేట్ల చొప్పున బోలేరో వాహనంలో కొబ్బరి బొండాల మధ్యలో రహస్యంగా (secret)భద్రపర్చి వరంగల్‌కు తరలించారు.
ఈ గంజాయిని తరలించే క్రమంలో ప్రధాన నిందితులిద్దరూ కారుకు ఎస్కార్టుగా(Escort) వ్యవహరించే వారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు ఆత్మకూర్ శివారులో నిర్వహించిన తనీఖీల్లో బోలేరో వాహనంలో కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పర్కాల ఏసిపి శివరామయ్య, టాస్క్ఫోర్స్ (Parakala)ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ బి.కుమార్, టాస్క్ఫోర్స్ ఎస్.ఐలు లవణకుమార్, నిసార్పాషా, హెడాకానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుళ్ళు శ్యామ్, రాజు, భిక్షపతి, సురేష్, శ్రవణ్ నవీన్, కరుణాకర్‌ను ఈస్ట్ జోన్ డిసిపి అభినందించారు.