Hognose snake | విధాత: మనషులు పాములను చూస్తే సహజంగానే భయపడిపోతారు. ఆ పాముల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రాణాలను కాపాడుకుంటారు. అలాగే ఓ పాము కూడా మనషుల దాడి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది.
అప్పటి వరకు బుసలు కొడుతూ, కోరలు చాచుతూ ముందుకు వెళ్లిన పాము.. ఓ వ్యక్తి తన చేతితో పామును టచ్ చేశాడు. ఇంకేముంది ఆ పాము చనిపోయినట్లు నటించింది. తన శరీరాన్ని తిప్పుతూ.. విగతజీవిలా పడిపోయినట్లు యాక్ట్ చేసింది.
ఈ పాము నటన నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది. ఏం యాక్టింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెడ్డిట్‌లో పోస్టు చేయబడ్డ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పామును పాముల ప్రపంచానికి డ్రామా రాణిగా అభివర్ణిస్తున్నారు.
అయితే ఈ పాము హగ్నోస్ జాతికి చెందినది. ఈ పాములు తమను తాము రక్షించుకోవడానికి ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి మనషులకు ఎలాంటి హానీని కలిగించవు. విషపూరితమైన పాములు కూడా కావు.