రూ.30 కోట్ల విలువైన రెండున్న‌ర కేజీల పాము విషం సీజ్‌

విధాత : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో భారీగా పాము విషం ప‌ట్టుబ‌డింది. అక్ర‌మంగా పాము విషాన్ని త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డ‌ పాము విషం విలువ రూ. 30 కోట్లు ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌శ్చిమ బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన మ‌హ‌మ్మ‌ద్ స‌రాఫ‌త్ పాము విషాన్ని స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్లు డార్జిలింగ్ పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. ఘోష్‌పుకూర్ ఫారెస్టులో త‌నిఖీలు నిర్వ‌హించారు. బైక్‌పై విషాన్ని […]

రూ.30 కోట్ల విలువైన రెండున్న‌ర కేజీల పాము విషం సీజ్‌

విధాత : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో భారీగా పాము విషం ప‌ట్టుబ‌డింది. అక్ర‌మంగా పాము విషాన్ని త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డ‌ పాము విషం విలువ రూ. 30 కోట్లు ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌శ్చిమ బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన మ‌హ‌మ్మ‌ద్ స‌రాఫ‌త్ పాము విషాన్ని స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్లు డార్జిలింగ్ పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. ఘోష్‌పుకూర్ ఫారెస్టులో త‌నిఖీలు నిర్వ‌హించారు. బైక్‌పై విషాన్ని త‌ర‌లిస్తున్న స‌రాఫ‌త్‌ను ఫారెస్టు అధికారులు, పోలీసులు క‌లిసి అదుపులోకి తీసుకున్నారు.

స‌రాఫ‌త్ వ‌ద్ద ఉన్న క్రిస్ట‌ల్ జార్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండున్న‌ర కేజీల విషం ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ విషం విలువ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో రూ. 30 కోట్లు ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ విషాన్ని ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఇండియాకు త‌ర‌లించిన‌ట్లు స‌రాఫ‌త్ అంగీక‌రించాడు. భార‌త్ నుంచి నేపాల్‌కు అక్క‌డ్నుంచి చైనాకు విషాన్ని త‌ర‌లించే దిశ‌గా స‌రాఫ‌త్ ప్లాన్ చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.