ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబర్‌లోనే.. తేదీ, సమయం.. కనిపించే ప్రాంతాలు వివరాలివే!

  • Publish Date - October 5, 2023 / 04:52 AM IST

విధాత‌: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబర్‌లోనే ఏర్పడబోతున్నది. 14న గ్రహణం రాత్రి 11:29 గంటలకు ప్రారంభమై రాత్రి 11.34 గంటలకు ముగియనున్నది. ఈ గ్రహం సర్వపిత్రి అమావాస్య రోజున ఏర్పడుతుండగా.. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం ఇదే. ఇది వృత్తాకార గ్రహణం ఏర్పడనుండగా.. దీన్ని రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా పిలుస్తుంటారు.



గ్రహణాన్ని ఖగోళ సంఘటనగా పరిగణిస్తారు. భూమి-సూర్యుని మధ్య చంద్రుడు రావడంతో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం ప్రపంచంలోని అనేక ప్రాంతాలల్లో దర్శనమిస్తుంది. పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తదితర ప్రాంతాల్లో చూడవచ్చు. అయితే, భారత్‌లో కనిపించే ఛాన్స్‌ లేదు. ఎందుకంటే ఆ సమయంలో చీకటి పడుతుంది.



ఇదిలా ఉండగా.. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్‌ 20న ఏర్పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఈ నెల 28న ఏర్పడబోతున్నది. ఇదిలా ఉండగా.. గ్రహణానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రముఖ స్థానం ఉంది. 14న సంభవించే ఈ సూర్యగ్రహణం కన్యారాశి రాశిలో ఉంది. సూర్యగ్రహణం ప్రారంభానికి 12 గంటల ముందు సూతక సమయం మొదలవుతుంది.



సూతకం సమయంలో పూజలు నిషిద్ధం. 14న సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి గ్రహణ సమయంలో సూతక కాలం కూడా చెల్లదు. గ్రహణం ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే సూతకం చెల్లుబాటవుతుంది. సూతకం సమయంలో దేవతామూర్తులకు పూజలు చేయడం నిషేధమని జ్యోతిష్య శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు.