Aarudra Ramalakshmi l విధాత: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత ఆరుద్ర (Arudra) జీవిత భాగస్వామి, ప్రముఖ సాహితీకారిణి కే రామలక్ష్మి (K Ramalakshmi) వృద్ధాప్య సమస్యలతో అస్తమించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత కాకినాడ జిల్లా కోటనందూరులో 1930, డిసెంబర్ 31న రామలక్ష్మి జన్మించారు.
మద్రాస్ యూనివర్సిటీ (Univercity of Madras) నుంచి బీఏ పాసయ్యారు. 1951 నుంచి ఆమె రచనా వ్యాసాంగంలో ఉన్నారు. ఇంగ్లిష్ సాహిత్యంలో దిట్ట. ఆంధ్రసాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యాన్ని ఆమె ఔపోసన పట్టారు. స్వతంత్ర (Swatantra) తెలుగు పత్రికలో ఆమె ఇంగ్లిష్ విభాగానికి సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు. పలు అనువాదాలు చేశారు.
తెలుగు ప్రజలు గర్వించే మహాకవి ఆరుద్రను (Aarudra)1954లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో రామలక్ష్మి ఆరుద్ర అనే కలం పేరుతో కూడా రచనలు చేశారు. పలు నవలలు, కథా సంకలనాలు వెలువరించారు. హైదరాబాద్‌లో ఉంటున్న రామలక్ష్మి వయోభారంతో అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.