ధరణి రిజిస్ట్రేషన్ కోసం నల్గొండకు యాంకర్ శ్రీముఖి
విధాత: ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ధరణి పోర్టల్ లో తన భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంది. శ్రీముఖి నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి పరిధిలో జాతీయ రహదారి వెంట రెండు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తన భూమికి సంబంధించి ధరణిలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆమె నకిరేకల్ తహశీల్ధార్ కార్యాలయానికి వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ పత్రాలను నకిరేకల్ తహాశిల్దార్ ప్రసాద్ నాయక్ శ్రీముఖికి అందజేశారు. ఆమె రాక విషయం […]

విధాత: ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ధరణి పోర్టల్ లో తన భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంది. శ్రీముఖి నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి పరిధిలో జాతీయ రహదారి వెంట రెండు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసింది.
కొనుగోలు చేసిన తన భూమికి సంబంధించి ధరణిలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆమె నకిరేకల్ తహశీల్ధార్ కార్యాలయానికి వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ పత్రాలను నకిరేకల్ తహాశిల్దార్ ప్రసాద్ నాయక్ శ్రీముఖికి అందజేశారు.
ఆమె రాక విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో ఆమెను చూసేందుకు వచ్చి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.