Madhya Pradesh | ప్రతి విద్యార్థికి ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. కొందరు రైటింగ్ స్కిల్స్‌లో, ఇంకొందరు చదువుల్లో, మరికొందరు ఆటల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు రైట్ హ్యాండ్‌తో రాయడం చూశారు. చాలా తక్కువ మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండ్‌తో రాస్తారు.
కానీ ఓ 100 మంది విద్యార్థులు మాత్రం రెండు చేతులతో ఏక కాలంలో రాసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అది కూడా వర్డ్ టు వర్డ్ రెండు చేతులతో రాసి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే.
#Video | 100 Students At This Madhya Pradesh School Write Using Both Hands https://t.co/xBlSakTIiZ pic.twitter.com/Rw3vm1pmmz
— NDTV (@ndtv) November 15, 2022
సింగ్రౌలి జిల్లా బుధేలా గ్రామంలోని వీణ వాడిని పబ్లిక్ పాఠశాల అది. ఈ పాఠశాలలోని ఓ 100 మంది విద్యార్థులు రెండు చేతులతో రాస్తారు. అంతేకాకుండా హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఉర్దూ, స్పానిష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఒకేసారి రెండు చేతులతో రాయడం, ఐదు భాషల్లో ప్రావీణ్యం సంపాదించడం కేవలం మెడిటేషన్, యోగా వల్లే సాధ్యమైందని విద్యార్థులు చెబుతున్నారు.
దివంగత మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఒకేసారి రెండు చేతులతో రాసేవారని ఆ స్కూల్ ప్రిన్సిపల్ విరాన్‌గడ్ శర్మ గుర్తు చేశారు. రాజేంద్ర ప్రసాద్‌ను స్ఫూర్తిగా తీసుకొని, తమ విద్యార్థులకు రెండు చేతులతో రాయించడం నేర్పామని తెలిపారు. విద్యార్థులు అలా రెండు చేతులతో రాస్తుంటే చూడముచ్చటగా ఉంటుందని పేర్కొన్నారు.