Sudan | సూడాన్‌లో మారణహోమం.. 22 మంది మృతి
Sudan విధాత: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సుడాన్ (Sudan) లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓండర్మన్ నగరంలో నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 22 మంది మరణించినట్లు దేశ ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. సుడాన్ ఆర్మీ, దేశ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య తలెత్తిన ఆధిపత్య పోరుతో సుడాన్ చిగురుటాకులా వణుకుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు విభాగాల మధ్య పోరు తలెత్తి 12 వారాలు గడవగా.. ఇప్పటి వరకు జరిగిన […]

Sudan
విధాత: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సుడాన్ (Sudan) లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓండర్మన్ నగరంలో నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 22 మంది మరణించినట్లు దేశ ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది.
సుడాన్ ఆర్మీ, దేశ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య తలెత్తిన ఆధిపత్య పోరుతో సుడాన్ చిగురుటాకులా వణుకుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు విభాగాల మధ్య పోరు తలెత్తి 12 వారాలు గడవగా.. ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఇదే దారుణమైన వైమానిక దాడి ఘటన అని స్థానిక అధికారులు వెల్లడించారు.
గత నెలలో ఐదుగురు చిన్నారులు సహా 17 మంది వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు 22 మంది మృతి చెందారు. ఈ దాడులకు పాల్పడింది ఆర్మీనేనని ర్యాపిడ్ ఫోర్స్ వాదిస్తోంది. అంతే కాకుండా చనిపోయిన వారి సంఖ్య 31కి పైనే ఉండొచ్చని వెల్లడించింది.
వందల ఇళ్లు నేలకూలాయని, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. దీనిపై ఆర్మీ వర్గాలు స్పందించలేదు. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో దేశవ్యాప్తంగా 3000 మది మరణించగా.. 30 లక్షల మంది వలస వెళ్లిపోయారని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి.