కేబుల్ బ్రిడ్జి వద్ద యువతి ఆత్మహత్యా యత్నం.. కాపాడిన పోలీసులు
లేక్ పోలీసింగ్ విధులు హర్షణీయం విధాత: సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆ యువతిని కాపాడిన మాదాపూర్ పోలీసులను సైబరా బాద్ సీపీ స్టెఫీన్ రవీంద్ర మాదాపూర్ సీఐ తిరుపతి సమక్షంలో అభినందించి వారికి రివార్డులు అందజేశారు. యువతిని రక్షించేందుకు ధైర్యసాహసాలు కనబర్చిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో భష్యత్తులోనూ ప్రమాదాల్లో ఉన్నవారిని కాపాడాలని కోరారు. మాదాపూర్ పోలీస్ […]

- లేక్ పోలీసింగ్ విధులు హర్షణీయం
విధాత: సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆ యువతిని కాపాడిన మాదాపూర్ పోలీసులను సైబరా బాద్ సీపీ స్టెఫీన్ రవీంద్ర మాదాపూర్ సీఐ తిరుపతి సమక్షంలో అభినందించి వారికి రివార్డులు అందజేశారు. యువతిని రక్షించేందుకు ధైర్యసాహసాలు కనబర్చిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో భష్యత్తులోనూ ప్రమాదాల్లో ఉన్నవారిని కాపాడాలని కోరారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్, దుర్గం చెరువు లేక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నవీన్‌కుమార్, తెలంగాణ టూరిజం శాఖకు చెందిన బోట్ డ్రైవర్ మనోహర్, హైదరాబాద్ యాచ్ క్లబ్‌కు చెందిన సెయిలింగ్ కోచ్ రజినీకాంత్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులు అందించారు. సైబరాబాద్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన లేక్ పోలీసింగ్ సత్ఫలితాలు ఇస్తుందని సీపీ అన్నారు.
నవంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో మోహీదీపట్నం రేతిబౌలి ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న కుమారి హర్షిత (19)అనే యువతి మానసిక ఒత్తిడి కారణంగా ఆకస్మాత్తుగా వంతెనా మీద నుంచి చెరువులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. బ్రిడ్జిపై పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న లేక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నవీన్‌కుమార్ వెంటనే అప్రమత్తమై దర్గుం చెరువు కేబుల్ బ్రిడ్జి కింద ఉన్న లేక్ పోలీస్‌లను సమాచారం అందజేశారు.
మాదాపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్, తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన బోట్ డ్రైవర్ మనోహర్, హైదరాబాద్ యాచ్‌క్లబ్‌కు చెందిన సెయిలింగ్ కోచ్ రజినీకాంత్ కలిసి ఆ యువతిని కాపాడి సీపీఆర్ చేసి, దగ్గర్లో ఉన్న హాస్పటల్‌కు తరలించారు. అనంతరం అమ్మాయి పరిస్థితి నిలకడగా ఉందని తెలుసుకున్నాక వారి తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపారు.