Suicide | కోటాలో విద్యార్థి బలవన్మరణం.. 17కి చేరిన ఆత్మహత్యల సంఖ్య
Suicide విధాత: వైద్య ప్రవేశ పరీక్షల కోసం రాజస్థాన్ (Rajasthan) కోటాలో సిద్ధమవుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ ఘటనతో 2023లో కోటాలో ఆత్మహత్యలు చేసుకుని కన్నుమూసిన వారి సంఖ్య 17కి చేరుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాంపుర్‌కు చెందిన మనోజ్ ఛబ్రా అనే టీనేజర్ నీట్ పరీక్ష కోచింగ్ కోసమని ఈ ఏడాది మొదట్లో కోటా (Kota) లోని ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు. గురువారం ఉదయం అతడి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఉండగా గుర్తించినట్లు […]

Suicide
విధాత: వైద్య ప్రవేశ పరీక్షల కోసం రాజస్థాన్ (Rajasthan) కోటాలో సిద్ధమవుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ ఘటనతో 2023లో కోటాలో ఆత్మహత్యలు చేసుకుని కన్నుమూసిన వారి సంఖ్య 17కి చేరుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాంపుర్‌కు చెందిన మనోజ్ ఛబ్రా అనే టీనేజర్ నీట్ పరీక్ష కోచింగ్ కోసమని ఈ ఏడాది మొదట్లో కోటా (Kota) లోని ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు.
గురువారం ఉదయం అతడి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఉండగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తాజా ఆత్మహత్యతో కోటాలో విద్యార్థుల మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. భారత్‌లో ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి దేశం నలుమూలల నుంచి లక్షల మంది విద్యార్థులు కోటాకు వస్తారు.
కొన్నేళ్లుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఈ నగరం ఏకైక గమ్యస్థానంగా ఉంటూ వస్తోంది. ఇక్కడ పోటీకి తట్టుకోలేక విద్యార్థులు ఒత్తిడికి, ఆత్మన్యూనతా భావానికి గురవుతుంటారని.. అందుకే ఆత్మహత్య (Suicide) ల గురించి ఆలోచిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. 2022లో ఇక్కడ 15 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.