తీహార్ జైలుకు స్వాగతం.. సీఎం కేజ్రీవాల్‌కు సుకేశ్ చంద్రశేఖర్ సందేశం
లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నట్లు మనీలాండరింగ్ కేసులో అదే జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ సందేశం పంపారు

విధాత : లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నట్లు మనీలాండరింగ్ కేసులో అదే జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ సందేశం పంపారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు బయటపెడతానని, తాను అప్రూవర్‌గా మారతానని, అన్ని ఆధారాలు ఇస్తానని, ఆయనకు శిక్ష పడేలా చూస్తానని అందులో పేర్కొన్నాడు.
‘నిజం గెలిచింది. ఆయన్ను (అరవింద్ కేజ్రీవాల్) తీహార్ జైలుకు స్వాగతిస్తున్నా’ అని ఒక సందేశంలో సుఖేశ్ పేర్కోన్నాడు. రూ. 200 కోట్ల మేర పలువురిని మోసగించడంతోపాటు మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఆప్ మంత్రులతోపాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాను కోట్లలో డబ్బు ఇచ్చినట్లు గతంలో ఆరోపించాడు.