దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ: మంత్రి హరీశ్ రావు

విధాత‌: తెలంగాణలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలు రద్దు చేయాలని బీజేపీ వాళ్లు అనడం సిగ్గుచేటని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొండపాక మండలంలో మంత్రి హరీశ్‌ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు ఆసరా నూతన పెన్షన్‌ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ట్యాంకర్లతో చెరువులు నింపుకున్న పరిస్థితులు ఉండేవి. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ నిండు కుండలా మారాయన్నారు. తాగడానికి గుక్కడు నీళ్లు లేక కష్టపడ్డ సిద్దిపేట […]

  • By: Somu    latest    Sep 20, 2022 10:45 AM IST
దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ: మంత్రి హరీశ్ రావు

విధాత‌: తెలంగాణలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలు రద్దు చేయాలని బీజేపీ వాళ్లు అనడం సిగ్గుచేటని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొండపాక మండలంలో మంత్రి హరీశ్‌ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు ఆసరా నూతన పెన్షన్‌ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఒకప్పుడు ట్యాంకర్లతో చెరువులు నింపుకున్న పరిస్థితులు ఉండేవి. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ నిండు కుండలా మారాయన్నారు. తాగడానికి గుక్కడు నీళ్లు లేక కష్టపడ్డ సిద్దిపేట జిల్లా ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణాలపై ప్రతిపక్షాలు గ్లోబల్ ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీంతో ఏడాదికి రెండు సార్లు వరి పంట సాగు అవుతుందని పేర్కొన్నారు. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు.

నాడు ఉపాధి కోసం వలస వెళ్లిన తెలంగాణలో నేడు వలస కూలీలు వచ్చి జీవనోపాధి పొందుతున్నారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.

ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దు అని మంత్రి అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయన్నారు. అనంతరం జప్తి నాచారంలో రూ.50లక్షలతో ఎస్సీ, గౌడ సంఘం భవనాలు మంజూరు చేశారు.