Supreme Court | రాజ్యాంగ ధర్మాసనానికి ‘రాజద్రోహం’ కేసు

Supreme Court న్యూఢిల్లీ: రాజద్రోహం చట్టంలోని అంశాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో విచారణను సుప్రీం కోర్టు కనీసం ఐదుగురు సభ్యలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది. బ్రిటిష్‌ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో కొత్త చట్టాలు తీసుకువచ్చేందుకు వీలుగా బిల్లులను ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మూడు చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నందున కేసు విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేయవద్దన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ప్రధాన […]

  • By: Somu    latest    Sep 12, 2023 12:26 PM IST
Supreme Court | రాజ్యాంగ ధర్మాసనానికి ‘రాజద్రోహం’ కేసు

Supreme Court

న్యూఢిల్లీ: రాజద్రోహం చట్టంలోని అంశాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో విచారణను సుప్రీం కోర్టు కనీసం ఐదుగురు సభ్యలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది.

బ్రిటిష్‌ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో కొత్త చట్టాలు తీసుకువచ్చేందుకు వీలుగా బిల్లులను ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ మూడు చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నందున కేసు విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేయవద్దన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.

ఒకటికి మించిన కారణాలు ఉన్న రీత్యా తాము కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ఆమోదించలేమని జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది