Viral Video | ఆస్తి కోసం అత్త ముఖాన్ని కొరికిన కోడ‌లు.. ఆపై మామ‌ను కాలితో త‌న్నేసింది..

Viral Video | ప్ర‌తి కుటుంబంలో ఆస్తి త‌గాదాలు అనేవి కామ‌న్. ఏదో ఒక సంద‌ర్భంలో ఆ త‌గాదాలు కుటుంబంలో చిచ్చు పెడుతాయి. అయితే ఆస్తి కోసం ఓ కోడ‌లు అత్త‌పై దాడి చేసింది. అత్త జుట్టు ప‌ట్టి లాగింది. ఆమె ముఖాన్ని కోడ‌లు విచ‌క్ష‌ణార‌హితంగా కొరికి తీవ్రంగా గాయ‌ప‌రిచింది. అడ్డుకోబోయిన మామ‌ను కూడా కాలితో త‌న్నేసింది కోడలు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో వెలుగు చూసింది. అయితే ఆ గొడ‌వ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆ ఇంట్లో […]

Viral Video | ఆస్తి కోసం అత్త ముఖాన్ని కొరికిన కోడ‌లు.. ఆపై మామ‌ను కాలితో త‌న్నేసింది..

Viral Video | ప్ర‌తి కుటుంబంలో ఆస్తి త‌గాదాలు అనేవి కామ‌న్. ఏదో ఒక సంద‌ర్భంలో ఆ త‌గాదాలు కుటుంబంలో చిచ్చు పెడుతాయి. అయితే ఆస్తి కోసం ఓ కోడ‌లు అత్త‌పై దాడి చేసింది. అత్త జుట్టు ప‌ట్టి లాగింది. ఆమె ముఖాన్ని కోడ‌లు విచ‌క్ష‌ణార‌హితంగా కొరికి తీవ్రంగా గాయ‌ప‌రిచింది. అడ్డుకోబోయిన మామ‌ను కూడా కాలితో త‌న్నేసింది కోడలు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో వెలుగు చూసింది.

అయితే ఆ గొడ‌వ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆ ఇంట్లో మ‌రో ఇద్ద‌రు చిన్నారులు, ఒక పెద్దాయ‌న ఉన్న‌ట్లు వీడియోలో క‌నిపిస్తుంది. ఓ చిన్నారి భ‌య‌ప‌డి ప‌క్క‌కు వెళ్లిపోయింది. మ‌రో ఇద్ద‌రు అత్తాకోడ‌ళ్ల‌ను విడిపించే ప్ర‌య‌త్నం చేయ‌నే చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అత్తాకోడ‌ళ్ల పంచాయితీని ఓ వ్య‌క్తి సూర‌త్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వీడియో ఆధారంగా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు పోలీసులు. అయితే వృద్ధురాలి ప‌ట్ల ఓ జంతువు మాదిరి ప్ర‌వ‌ర్తించిన కోడ‌ల్ని నెటిజ‌న్లు తిట్టిపోస్తున్నారు. ఆస్తి త‌గాదాలు ఉంటే.. ప‌శువుల్లా ప్ర‌వ‌ర్తిస్తారా? అని కోడ‌లిపై మండిప‌డుతున్నారు.