విధాత, సినిమా: విశ్వసుందరి సుస్మితాసేన్ (Sushmita Sen) గుండెపోటుకు గురయ్యారు అనే వార్తలు అభిమానుల, సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఆమె గుండె పోటుకు సర్జరీ చేసి స్టెంట్స్ వేశారనే విషయంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచారు.
అయితే తనకు చికిత్స పూర్తయిన తర్వాత సుస్మిత తనకు జరిగిన ప్రమాదకర విషయాలను ప్రపంచానికి వెల్లడించారు. అయితే హార్ట్ ఎటాక్ ( Heart attack) జరిగిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారనే విషయంపై ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వెల్లడిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘నేను తీవ్రమైన భారీ గుండెపోటుకు గురయ్యాను. ఆ గుండెపోటు చాలా తీవ్రమైనది. గుండెలో 90% నాళాలు మూసుకుపోయాయి. ఆ సమయంలో చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాను. వెంటనే హాస్పిటల్‌లో చేరే ఏర్పాటు చేసుకున్నాం. హార్ట్ ఎటాక్ రాగానే భయపడలేదు. ధైర్యంగా ఉన్నాను. అదే నన్ను బతికించేలా చేసింది.
మనోధైర్యమే నేను ప్రాణాలతో ఉండేలా చేసింది’’ అని సుస్మితాసేన్ పేర్కొంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘సకాలంలో ముంబైలోని నానావతి హాస్పిటల్ (Nanavati Hospital0 లో చేర్చడంతో బతికి బయటపడ్డాను. నాకు గుండెపోటు వచ్చిందనే విషయం నా ఫ్యామిలీలోని కొద్ది మందికి మాత్రమే తెలుసు. నా ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరికీ తెలియచేయవద్దని చెప్పాను. స్నేహితులు నాకు అండగా నిలిచారు. అందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అని సుస్మిత తెలిపారు.
‘‘ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు చాలా సంతోషం. ఇలా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా ట్రీట్మెంట్‌కు, నా ఫ్యామిలీ మనోభావాలను గౌరవించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఉద్దేశపూర్వకంగా నా ట్రీట్మెంట్ విషయాన్ని గోప్యంగా ఉంచాం. నా అంతట నేనే ఈ విషయాన్ని తెలియజేయాలని అనుకున్నాను అందుకే ఆలస్యంగా ఈ వార్తను నేను బయట ప్రపంచానికి తెలియజేస్తానని చెప్పాను.
These pics of #SushmitaSen ‘s yoga fitness challenge are still in front of my eyes after hearing of massive heart attack with 95% blockage at just the age of 47.
So many questions on what else is called a healthy lifestyle then….?
What do you say???? pic.twitter.com/jO2SFb7hiv
— Neetu Garg (@NeetuGarg6) March 5, 2023
గుండెపోటుకు గురైన నాకు సకాలంలో వైద్యం అందించిన డాక్టర్లకు, నన్ను జాగ్రత్తగా చూసుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్‌కు, ట్రీట్మెంట్ తర్వాత నాకు శుభాకాంక్షలు తెలుపుతూ త్వరగా కోలుకోవాలని మెసేజీలు పెట్టిన అభిమానులకు నేను రుణపడి ఉంటాను’’ అంటూ సుస్మితా సేన్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగుంది. డిశ్చార్జి తర్వాత తగినంత విశ్రాంతి తీసుకున్నాను. డాక్టర్ల అనుమతితో జైపూర్‌లో జరుగుతున్న ‘ఆర్యా’ సీజన్ 3 షూటింగ్‌కు వెళ్తున్నాను. తాళి అనే ఓ ఓటిటి వెబ్ సిరీస్‌కు డబ్బింగ్ కూడా పూర్తయిందని సుస్మితా సేన్ చెప్పుకొచ్చారు.