Swarna Devalayam | స్వ‌ర్ణ‌దేవాల‌యం స‌మీపంలో మూడో పేలుడు.. ఐదుగురి అరెస్టు

Swarna Devalayam | విధాత‌: పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ స్వ‌ర్ణ‌దేవాల‌యం (Swarna Devalayam) స‌మీపంలో వ‌ర‌స పేలుళ్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే రెండు బాంబు పేలుళ్లు జ‌ర‌గ‌గా బుధ‌వారం అర్ధ‌రాత్రి మూడో సారి స్వ‌ల్ప విస్ఫోటం సంభ‌వించింది. స్వ‌ర్ణ‌దేవాల‌యం స‌మీపంలోని లంగ‌ర్ హాల్‌, రాం దాస్ స‌రాయీల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అనుమానితులు గురురాం దాస్ భ‌వ‌నం కిటికీ నుంచి బాంబును విసిరార‌ని పోలీసుల ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. 'వ‌రుస స్వ‌ల్ప పేలుళ్ల‌కు సంబంధించి కేసును ప‌రిష్క‌రించాం. […]

Swarna Devalayam | స్వ‌ర్ణ‌దేవాల‌యం స‌మీపంలో మూడో పేలుడు.. ఐదుగురి అరెస్టు

Swarna Devalayam |

విధాత‌: పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ స్వ‌ర్ణ‌దేవాల‌యం (Swarna Devalayam) స‌మీపంలో వ‌ర‌స పేలుళ్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే రెండు బాంబు పేలుళ్లు జ‌ర‌గ‌గా బుధ‌వారం అర్ధ‌రాత్రి మూడో సారి స్వ‌ల్ప విస్ఫోటం సంభ‌వించింది.

స్వ‌ర్ణ‌దేవాల‌యం స‌మీపంలోని లంగ‌ర్ హాల్‌, రాం దాస్ స‌రాయీల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అనుమానితులు గురురాం దాస్ భ‌వ‌నం కిటికీ నుంచి బాంబును విసిరార‌ని పోలీసుల ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. ‘వ‌రుస స్వ‌ల్ప పేలుళ్ల‌కు సంబంధించి కేసును ప‌రిష్క‌రించాం. ఐదుగురు నిందితుల‌ను అరెస్టు చేశాం’ అని పంజాబ్ డీజీపీ గౌర‌వ్ యాద‌వ్ ట్వీట్ చేశారు.

అంతే కాకుండా వారి ద‌గ్గ‌రి నుంచి ఒక బ్యాగ్‌ను కూడా స్వాధీనం చేసుకున్న‌ట్లు ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. అరెస్ట‌యిన వారు ఏ ఉగ్ర‌వాద సంస్థ‌కూ చెందిన వారు కాద‌ని పేర్కొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో ఇటీవ‌లే వివాహం అయిన ఒక యువ జంట ఉన్న‌ట్లు తెలుస్తోంది.