వర్షం ఎఫెక్ట్‌: T20.. బంగ్లాదేశ్‌పై భారత్ ఉత్కంఠ విజయం

విధాత: టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి దాకా ఆసక్తి రేపింది. ఈ ఉత్కంఠ పోరులో భారత్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ 64, రాహుల్‌ 50, సూర్యకుమార్‌ 30 పరుగులు చేయడంతో భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో మహమూద్‌ 3, షకీబ్‌ అల్‌ హసన్‌ […]

  • By: krs    latest    Nov 02, 2022 3:00 PM IST
వర్షం ఎఫెక్ట్‌: T20.. బంగ్లాదేశ్‌పై భారత్ ఉత్కంఠ విజయం

విధాత: టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి దాకా ఆసక్తి రేపింది. ఈ ఉత్కంఠ పోరులో భారత్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.

బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ 64, రాహుల్‌ 50, సూర్యకుమార్‌ 30 పరుగులు చేయడంతో భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో మహమూద్‌ 3, షకీబ్‌ అల్‌ హసన్‌ 2 వికెట్లు తీశారు.

185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ తొలుత జోరు కొనసాగించింది. అయితే, 7వ ఓవర్‌ పూర్తవ గానే వర్షం అంతరాయం కలిగించింది. దీంతో బంగ్లాదేశ్‌ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. బంగ్లాదేశ్‌ 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.

మ్యాచ్‌ పునఃప్రారంభమయ్యాక బంగ్లాదేశ్‌ త్వరత్వరగా వికెట్లను చేజార్చుకుంది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లలో లిటన్‌ దాస్‌ 60, నజ్ముల్‌ 21, నురుల్ 25 పరుగులు చేశారు. లిటన్‌ దాస్‌ రన్నౌట్‌ తర్వాత మ్యాచ్‌ ఒక్కసారిగా భారత్‌ వైపు మళ్లింది.