10బిల్లులు వెనక్కి పంపిన తమిళనాడు గవర్నర్‌

10బిల్లులు వెనక్కి పంపిన తమిళనాడు గవర్నర్‌

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసి ఆమోదం కోసం పంపించిన 10బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్‌.రవి వెనక్కి పంపించారు. అందులో ప్రభుత్వ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ అధికారాన్ని పరిమితం చేసే బిల్లు కూడా ఉంది. పంజాబ్, తమిళనాడు గవర్నర్లు బిల్లులు అమోదంలో భాష్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు అగ్రహం వ్యక్తం చేసి వారమైనా గడవకముందే తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి బిల్లులను వెనక్కి పంపడం సంచలనంగా మారింది. నీట్ పరీక్షను రద్దు చేసే బిల్లును కూడా అంతకుముందు గవర్నర్ ఆమోదించకుండానే వెనక్కి పంపారు. కాగా గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి ఆయనకు పంపనున్నట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు వెల్లడించారు. ఇందుకోసం శనివారం అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బీజేపీ నియమించిన గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే బిల్లుల ఆమోదంలో ఆలస్యం చేస్తున్నారని, ఇది ప్రజల ద్వారా ఎన్నికైన పాలనను అణగదొక్కడమే అవుతుందని డీఎంకే ప్రభుత్వం విమర్శిస్తోంది.