TDP: హమ్మయ్య ఉత్తరాంధ్రలో ఊపిరొచ్చింది! MLC గెలుపుతో TDPలో హుషారు!!

విధాత‌: మొన్నటివరకూ ఎన్నికలు అనే సౌండ్ వింటేనే ఆమడదూరం పరుగెత్తి పారిపోయే టిడిపికి ఇప్పుడు కాస్త ఊపిరొచ్చింది. పీకమీద అడుగేసి మట్టానికి తొక్కేస్తుంటే ఊపిరాడ‌ని పరిస్థితి.. ఇంకో కొన్ని సెకన్లలో ఊపిరి ఆగిపోతుందనగా కాలు చిన్నగా ఎత్తి గాలి పీల్చుకునేందుకు అవకాశం దక్కిన పరిస్థితి.. అవును ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కోటాలో వేపాడ చిరంజీవిరావు గెలుపు టిడిపికి మాడిపోతున్న పేనం మీద కాస్త నీళ్లు చిలకరించినట్లు అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 34 […]

TDP: హమ్మయ్య ఉత్తరాంధ్రలో ఊపిరొచ్చింది! MLC గెలుపుతో TDPలో హుషారు!!

విధాత‌: మొన్నటివరకూ ఎన్నికలు అనే సౌండ్ వింటేనే ఆమడదూరం పరుగెత్తి పారిపోయే టిడిపికి ఇప్పుడు కాస్త ఊపిరొచ్చింది. పీకమీద అడుగేసి మట్టానికి తొక్కేస్తుంటే ఊపిరాడ‌ని పరిస్థితి.. ఇంకో కొన్ని సెకన్లలో ఊపిరి ఆగిపోతుందనగా కాలు చిన్నగా ఎత్తి గాలి పీల్చుకునేందుకు అవకాశం దక్కిన పరిస్థితి.. అవును ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కోటాలో వేపాడ చిరంజీవిరావు గెలుపు టిడిపికి మాడిపోతున్న పేనం మీద కాస్త నీళ్లు చిలకరించినట్లు అయింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకుగాను ఆరు మాత్రమే దక్కించుకుని ఘోరంగా దెబ్బతిన్న టిడిపి ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థలు.. మున్సిపల్.. పంచాయతీ ఎన్నికల్లో వైసిపిని ఎదుర్కోవడం టిడిపికి సాధ్యం కాలేదు. పార్టీలోని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ లాంటివాళ్ళు వైసీపీవైపు మళ్ళిపోయారు. గంటాలాంటి సీనియర్ ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే.. ఎక్కడా పత్తా లేకుండా పోయాడు.. చంద్రబాబు విశాఖ వచ్చినా ఎదురెళ్లి పలకరించని పరిస్థితి.

అయ్యన్న పాత్రుడు పోలీసులతో ఫైటింగుకే టైం సరిపోవడం లేదు. క్యాడర్ మొత్తం చెల్లా చెదురైంది. ఇలాంటి తరుణంలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో చిరంజీవి గెలుపు టిడిపికి ఊపిరిలూదింది. మళ్ళీ క్యాడర్ సత్తువను కూడగట్టేందుకు ఓ ఆశ మొదలైంది. దాదాపు వెంటిలేటర్ మీదున్న పార్టీకి కొత్త జీవం వచ్చినట్లు అయింది. మరోవైపు గంటా శ్రీనివాసరావు యాక్టివ్ అవ్వడం పార్టీకి ఇంకో ఆఫర్ లా వచ్చింది.

నాలుగేళ్లుగా కనిపించని గంటా ఈ ఎన్నికలకు మాత్రం బయటికి వచ్చి పార్టీ కోసం ప్రచారం చేశారు..పేకాట్లో రైజింగ్ హ్యాండ్స్ ఉన్నట్లే పాలిటిక్స్ లో గంటాది కూడా రైజింగ్ అంటారు. మరి ఆయన చేతిచలవ వల్ల గెలిచారో.. ఇంకేం జరిగిందో కానీ మొత్తానికి చిరంజీవి గెలుపు టిడిపిలో కొత్త ఆశలు రేపుతోంది.