60 మంది అభ్య­ర్థు­లతో టీడీపీ జాబితా!

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్ని­కల్లో పోటీ చేసే అభ్య­ర్థు­లపై టీడీపీ కస­రత్తు పూర్తి చేస్తు­న్నది.

  • Publish Date - January 9, 2024 / 08:53 AM IST
  • సిద్ధం చేసిన అధి­నేత చంద్ర­బాబు


విధాత: రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్ని­కల్లో పోటీ చేసే అభ్య­ర్థు­లపై టీడీపీ కస­రత్తు పూర్తి చేస్తు­న్నది. ఈ క్రమంలో త్వరలో విడు­దల చేసేం­దుకు 60 మంది పేర్లతో జాబి­తాను పార్టీ జాతీయ అధ్య­క్షుడు నారా చంద్ర­బాబు నాయుడు సిద్ధం చేశా­రని తెలు­స్తు­న్నది. అవ­స­ర­మైన మార్పులు చేర్పులు ఉంటే పరి­శీ­లించి, నెలా­ఖ­రులో విడు­దల చేస్తా­రని సమా­చారం.


జాబి­తాలో వీరే


ఇచ్ఛా­పురం : బెందాళం అశోక్, టెక్కలి :అచ్చె­న్నా­యుడు, ఆము­దా­ల­వ­లస : కూన రవి­కు­మార్, పలాస :గౌతు శిరీష, రాజం : కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి : బేబీ నయన, విజ­య­న­గరం : అశోక్ గజ­పతి రాజు, చీపు­రు­పల్లి :కిమిడి నాగ­ర్జున, కురుపాం : టీ జగ­దీ­శ్వరి, పార్వ­తీ­పురం : బీ విజ­య­చంద్ర, వైజాగ్ (తూర్పు) : వెల­గ­పూడి రామ­కృ­ష్ణ­బాబు, వైజాగ్ (పశ్చిమ) :గణ­బాబు, పాయ­క­రా­వు­పేట :అనిత, నర్సీ­పట్నం :చింత­కా­యల విజయ్, తుని: ­య­న­మల దివ్య, జగ్గం­పేట : జ్యోతుల నెహ్రూ, పెద్దా­పురం : చిన­రా­జప్ప, అన­పర్తి నల్ల­మిల్లి రామ­కృష్ణా రెడ్డి, రాజ­మండ్రి (అర్బన్) : ఆది­రెడ్డి వాసు, గోపా­ల­పురం : మద్ది­పాటి వెంక­ట్రాజు, ముమ్మ­డి­వరం : దాట్ల సుబ్బ­రాజు, అమ­లా­పురం : బత్తుల ఆనం­ద­రావు, మండ­పేట : వేగుళ్ల జోగే­శ్వ­ర­రావు, ఆచంట : పితాని సత్య­నా­రా­యణ, పాల­కొల్లు – నిమ్మల రామా­నా­యుడు, ఉండి : మంతెన రామ­రాజు, దెందు­లూరు : చింత­మ­నేని ప్రభా­కర్, విజ­య­వాడ ఈస్ట్ : గద్దె రామ్మో­హన్ రావు, విజ­య­వాడ (సెంట్రల్) : బోండా ఉమ, నంది­గామ : తంగి­రాల సౌమ్య, జగ్గ­య్య­పేట : శ్రీరామ్ తాతయ్య, మచి­లీ­పట్నం : కొల్లు రవీంద్ర, గన్న­వరం : యార్ల­గడ్డ వెంక­ట్రావు, పెన­మ­లూ­రు­: బోడె ప్రసాద్, మంగ­ళ­గి­రి­: నారా లోకేష్, పొన్నూ­రు: ­ధూ­ళి­పాళ్ల నరేంద్ర, చిల­క­లూ­రి­పేట : పత్తి­పాటి పుల్లా­రావు, సత్తె­న­పల్లి : కన్నా లక్ష్మీ నారా­యణ, విను­కొండ : జీవీ ఆంజ­నే­యులు, గుర­జాల : యర­ప­తి­నేని శ్రీని­వా­స­రావు, మాచర్ల : జూల­కంటి బ్రహ్మా­నం­ద­రెడ్డి, వేమూరు : నక్కా ఆనం­ద­బాబు, పర్చూరు : ఏలూరి సాంబ­శి­వ­రావు, ఒంగోలు : దామె­చర్ల జనా­ర్దన్, కొండపి : శ్రీబాల వీరాం­జ­నేయ స్వామి, కని­గిరి : ఉగ్ర నర­సింహా రెడ్డి, కోవూరు : పోలం­రెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మ­కూరు : ఆనం రామ­నా­రా­యణ రెడ్డి, నెల్లూరు రూరల్ : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీ కాళ­హస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి : గాలి భాను­ప్ర­కాష్, పల­మ­నేరు : అమ­ర్‌­నాథ్ రెడ్డి, పీలేరు : నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జమ్మ­ల­మ­డుగు : భూపేష్ రెడ్డి, మైదు­కూ­రు: ­పుట్టా సుధా­కర్, పులి­వెం­దు­ల : ­బీ­టెక్ రవి, బన­గానె­పల్లి : బీసీ జనా­ర్దన్ రెడ్డి, పాణ్యం : గౌరు చరి­తా­రెడ్డి, కర్నూలు : టీజీ భరత్, ఎమ్మి­గ­నూరు : బీవీ జయ­నా­గే­శ్వర రెడ్డి, రాప్తాడు : పరి­టాల సునీత, ఉర­వ­కొండ : పయ్యా­వుల కేశవ్, తాడి­పత్రి : జేసీ అస్మిత్ రెడ్డి, కల్యా­ణ­దుర్గం : ఉమా మహే­శ్వర నాయుడు, హిందూ­పూర్ : నంద­మూరి బాల­కృష్ణ, కదిరి : కంది­కుంట వెంకట ప్రసాద్.