Uttarakhand | సెలవులో ఉన్న టీచర్లకు పదవీ విరమణ.. ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం
విధాత: ఉత్తరాఖండ్ (Uttarakhand ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలం సెలవులో ఉన్న ప్రభుత్వ టీచర్లతో పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదవీ విరమణ చేయించిన వారిలో కొత్త వారిని నియమించనుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్‌సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆరు నెలలు అంత కంటే ఎక్కువ కాలం నుంచి పాఠశాలలకు రాకుండా విధులకు డుమ్మా […]

విధాత: ఉత్తరాఖండ్ (Uttarakhand ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలం సెలవులో ఉన్న ప్రభుత్వ టీచర్లతో పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదవీ విరమణ చేయించిన వారిలో కొత్త వారిని నియమించనుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్‌సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆరు నెలలు అంత కంటే ఎక్కువ కాలం నుంచి పాఠశాలలకు రాకుండా విధులకు డుమ్మా కొడుతున్నటీచర్ల జాబితాను తయారు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో స్కూళ్ల విధుల నుంచి తప్పించుకుంటున్న వారు 150 మంది ఉన్నట్లు తేలింది. ఈ 150 మందితో పదవీ విరమణ చేయించాలని ఉత్తరాఖండ్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.
అయితే కొండట ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో నియామకాలు పొందిన ప్రభుత్వ టీచర్లలో చాలా మంది విధులకు రావట్లేదని విద్యాశాఖ విచారణలో తేలిందట. కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు రవాణా మార్గాలు సరిగా లేకపోవడంతోనే టీచర్లు సుదీర్ఘ కాలం సెలవు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కొందరైతే జీతం లేని సెలవుల ఆప్షన్ కింద సంవత్సరాల తరబడి విధులకు గైర్హాజరవుతున్నట్లు తేలింది. టీచర్లు సుదీర్ఘ కాలం సెలవులో ఉండటంతో విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని, పదవీ విరమణ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.