ఫ్రెండ్స్‌తో శృంగారం చేయమని.. భార్యను హింసిస్తున్న టెక్కీ
విధాత: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. తనతోనే కాకుండా.. ఫ్రెండ్స్‌తో కూడా శృంగారం చేయాలని భార్యను బలవంతం పెట్టాడు. అంతేకాదు.. ఆమెతో ఫ్రెండ్స్ గడిపిన దృశ్యాలను తన ఫోన్‌లో బంధించాడు. భర్త ఆగడాలు భరించలేని భార్య విడాకులు కావాలని డిమాండ్ చేసింది. దీంతో ఫ్రెండ్స్‌తో శృంగారం చేసిన వీడియోలను అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు భర్త. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. […]

విధాత: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. తనతోనే కాకుండా.. ఫ్రెండ్స్‌తో కూడా శృంగారం చేయాలని భార్యను బలవంతం పెట్టాడు. అంతేకాదు.. ఆమెతో ఫ్రెండ్స్ గడిపిన దృశ్యాలను తన ఫోన్‌లో బంధించాడు. భర్త ఆగడాలు భరించలేని భార్య విడాకులు కావాలని డిమాండ్ చేసింది. దీంతో ఫ్రెండ్స్‌తో శృంగారం చేసిన వీడియోలను అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు భర్త. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని సంపిగెహల్లికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వీరికి 2011లో వివాహం కాగా, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే భర్త ఇటీవల కాలంలో డ్రగ్స్‌కు, మద్యానికి బానిస అయ్యాడు. ఓ ఇద్దరు ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చే వాడు. తనతో పాటు తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో శృంగారం చేయాలని భార్యను బలవంతం చేసేవాడు.
అందుకు అంగీకరించకపోతే హింసించేవాడు. దారుణంగా కొట్టేవాడు. ఆ బాధలు భరించలేక బాధితురాలు భర్త ఫ్రెండ్స్‌తో కూడా లైంగిక చర్యలో పాల్గొనేది. ఈ దృశ్యాలను భర్త రికార్డు చేసి భద్రపరుచుకున్నాడు. కొద్ది రోజుల నుంచి భర్త ఆగడాలు మితిమీరడంతో, విడాకులు కావాలని ఆమె డిమాండ్ చేసింది. విడాకులు అడిగితే.. తన ఫ్రెండ్స్‌తో లైంగిక చర్యలో పాల్గొన్న వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని భర్త బెదిరిస్తున్నాడు.
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. మద్యం, డ్రగ్స్ కు తన భర్త బానిస అయ్యాడు. మద్యం మత్తులో తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. అతని ఫ్రెండ్స్‌తో గడపాలని ఇబ్బంది పెట్టి, హింసిస్తే ఆ పని కూడా చేశాను.
అతని ఆగడాలు భరించలేక విడాకులు కావాలని అడిగితే.. ఆ వీడియోలను బయట పెడుతానని బెదిరిస్తున్నాడని భార్య వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి ఆవరణలో పెంచుకుంటున్న గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు.