అభివృద్ధికి టెక్నాలజీ జత కలిస్తే మరిన్ని అద్భుతాలు: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: అభివృద్ధికి టెక్నాలజీ జత చేస్తే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ కార్యాలయాలలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఈ-ఆఫీస్ విధానాన్ని కలెక్టర్ కార్యాలయం ఆయన ప్రారంబించి మాట్లాడారు. "ఈ" ఆఫీస్ విధానం ద్వారా సమయం ఆధాతో పాటు ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఈ ఆఫీస్ విధానం ఉపయోగకరం అన్నారు. నేడు రెవిన్యూ శాఖ లో ప్రారంభమైన ఈ […]

విధాత: అభివృద్ధికి టెక్నాలజీ జత చేస్తే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ కార్యాలయాలలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఈ-ఆఫీస్ విధానాన్ని కలెక్టర్ కార్యాలయం ఆయన ప్రారంబించి మాట్లాడారు.
“ఈ” ఆఫీస్ విధానం ద్వారా సమయం ఆధాతో పాటు ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఈ ఆఫీస్ విధానం ఉపయోగకరం అన్నారు. నేడు రెవిన్యూ శాఖ లో ప్రారంభమైన ఈ ఆఫీస్ సేవలు త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలకు విస్తరించనున్నట్లు తెలిపారు.
ఈ ఆఫీస్ విధానంతో అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఆయా డిపార్ట్‌మెంట్స్‌లో ఫైల్స్ మిస్సింగ్ జరుగుతున్నాయని, ఈ ఆఫీస్ విధానం అమల్లోకి వస్తే మిస్సింగ్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఫైల్స్ స్టేటస్‌ను జిల్లా, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
ఒక ఫైల్ ఆఫీసర్‌కు చేరిన డేట్, టైం వివరాలన్నీ ఆన్‌లైన్‌లో కనిపిస్తాయని మంత్రి అన్నారు. ఈ ఆఫీస్ సేవలు ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాదికారులకు, ప్రభుత్వ సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగ యువతీ సమస్యపై ఈ ఆఫీసు విధానంలో నేరుగా మంత్రి తహశీల్దార్‌తో మాట్లాడారు. రేపటిలోగా యువతీకి న్యాయం జరపాలని అదేశించారు.
బుడిగ మమత యాతవాకిళ్ళ గ్రామంలో మఠంపల్లి ఇంటి వెనకాల బాత్రూంలు కట్టకుండా అడ్డుకుంటున్నారని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది. ఆన్లైన్ ప్రజావాణి ద్వారా మంత్రి స్వయంగా మండల ఎంపీడీవో, తహశిల్దార్లతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.