తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు

తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

విధాత: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. భట్టికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి దర్శనం చేయించి లడ్డూ ప్రసాదాలను అందించారు.


అనంతరం భట్టి మాట్లాడుతూ ఆ దేవుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన అధ్భుతమైన తీర్పునిచ్చారన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.