EAMCET: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల.. పరీక్షా తేదీలివే
విధాత: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న ఎంసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు రూ.500లుగా నిర్ణయించారు. ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు రూ.900లుగా ఫిక్స్ చేశారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. […]

విధాత: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న ఎంసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు రూ.500లుగా నిర్ణయించారు. ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు రూ.900లుగా ఫిక్స్ చేశారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొన్నది.