Ramayampet | ప్రజా ఉద్యమానికి తలవంచిన సర్కార్.. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు జీవో

Ramayampet | అభ్యంతరాలు, విజ్ఞప్తులకు వారం గడువు మొదటి దశలో 189 రోజుల ఉద్యమం.. మలి దశలో 158 రోజులు ఇంటలిజెన్స్ నివేదికతో తేరుకున్న సీఎం మెదక్ సభలో సీఎం హామీ.. వెనువెంటనే ప్రక్రియ ప్రారంభం విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం స్పందించింది. తొలి, మలి దశలో జేఏసీ నాయకులు చేసిన ఉద్యమాలు ఫలించాయి. అన్ని రాజకీయపార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛందంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం పోరు సాగించారు. మొదటి దశ […]

Ramayampet | ప్రజా ఉద్యమానికి తలవంచిన సర్కార్.. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు జీవో

Ramayampet |

  • అభ్యంతరాలు, విజ్ఞప్తులకు వారం గడువు
  • మొదటి దశలో 189 రోజుల ఉద్యమం..
  • మలి దశలో 158 రోజులు
  • ఇంటలిజెన్స్ నివేదికతో తేరుకున్న సీఎం
  • మెదక్ సభలో సీఎం హామీ.. వెనువెంటనే ప్రక్రియ ప్రారంభం

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం స్పందించింది. తొలి, మలి దశలో జేఏసీ నాయకులు చేసిన ఉద్యమాలు ఫలించాయి. అన్ని రాజకీయపార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛందంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం పోరు సాగించారు. మొదటి దశ పోరులో జేఏసీ, ప్రతిపక్ష నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీక్షలు, బంద్ లు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ లు భారీ ర్యాలీలు నిర్వహించారు.

జేఏసీ అధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, వర్తక, వాణిజ్య, వ్యాపారులు సైతం ఉద్యమంలో ఉధృతంగా భాగస్వాములయ్యారు. మొదటి దశ ఉద్యమంలో పోలీస్ లు ఉద్యమకారులపై లారీచార్జి చేసి ఉద్యమాన్ని దెబ్బతీయాలని పన్నాగం పన్నినా, ఉద్యమ కారులు వెనకడుగు వేయలేదు. వేలాది మందితో జేఏసీ అధ్వర్యంలో ఉద్యమం నడిపింది. కాంగ్రెస్, బీజేపీలు తోడుకావడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఇంటలిజెన్స్ అధికారుల నివేదికతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.

హామీ ఇచ్చి మాట తప్పారు..

మొదటి దశ ఉద్యమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లు హామీ ఇచ్చినా అమలు కాలేదు. పైగా రాష్ర్టంలో ఏ ఒక్క డివిజన్ ను ప్రభుత్వం ఇచ్చినా, రామాయంపేట రెవెన్యూ డివిజన్ మొదట ఏర్పాటు చేస్తామని చెప్పి ఒప్పించి, దీక్షలను విరమింప చేశారు. తరువాత 3 డివిజన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినా రామాయంపేట రెవెన్యూ డివిజన్ అంశాన్ని అప్పుడు పక్కన పెట్టారు. దీంతో మళ్లీ జేఏసీ ఉద్యమం ప్రారంభించింది.

క్రమక్రమంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఉద్యమానికి మద్దతుగా పెరుగుతూ వచ్చింది. వేలాది మంది ప్రజలు కదిలి వచ్చి రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. జేఏసీ నాయకులు అశ్విని శ్రీనివాస్, దామోదర్ తదితర జేఏసీ నాయకులు మొక్కవోని ధైర్యంతో ప్రతి రోజూ దీక్షలు చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి వేలాది మందితో ర్యాలీ తీసి నిరసన తెలిపారు.

బీజేపీ నాయకుడు నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అధ్వర్యంలో పాదయాత్ర చేసి మద్దతు తెలిపారు. వర్తక, వాణిజ్య వ్యాపార సంఘాలు సైతం బంద్, ర్యాలీలు, రాస్తారోకోలు మానవహారాలు చేశారు. పెద్ద ఎత్తున సబండ వర్గాలు రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమించారు. ప్రభుత్వం స్పందించింది.

ఇటీవల జరిగిన మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవ సభలో సీఎం మెదక్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా ప్రభుత్వం డివిజన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు జీఓను సైతం జారీ చేసింది. ఏమైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే కలెక్టర్ కు రాతపూర్వకంగా ఇవ్వడానికి వారం రోజుల సమయం ప్రభుత్వం ఇచ్చింది.

4 మండలాలు, మున్సిపాలిటీ కలిపి..

రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియ ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా డ్రాఫ్ట్ జీఓ ప్రభుత్వం విడుదల చేసింది. రామాయంపేట, నిజాంపేట్, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల తో పాటు రామాయంపేట మున్సిపాలిటీనీ కలిపి రామాయంపేట రెవెన్యూ డివిజన్ నూతనంగా ఏర్పడబోతుంది.

రామాయంపేట నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్ లో భాగంగా రద్దయింది. దీంతో రామాయంపేట లో వ్యాపారాలు తగ్గిపోయాయి. 1955లో ఏర్పాటైన రామాయంపేట నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్ లో రద్దు కావడంతో ఈ ప్రాంత ప్రభావం తగ్గిపోయింది. డివిజన్ ఏర్పాటు ఐతే మళ్ళీ డీలిమిటేషన్ లో తిరిగి రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటు అవుతుందని ఈ ప్రాంత ప్రజల నమ్మకం.

ఉద్యమంలో కీలకంగా జేఏసీ నేతలు

రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఉద్యమానికి నాయకత్వం వహించిన జేఏసీ నాయకుల కృషి మరువలేనిది. పోచమ్మ ల అశ్విని శ్రీనివాస్, సుంకోజి దామోదర్ చారి, దోమకొండ యాదగిరి, చింతల శేఖర్, అర్ వినయ్ సాగర్, వైఎస్ వెనకటి, అర్ నరేష్, యెని శట్టి అశోక్, వెలుముల రమేష్ తదితరులు కీలక పాత్ర పోషించారు. మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఉద్యమంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: అశ్విని శ్రీనివాస్

మొక్కవోని ధైర్యంతో జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి, ప్రజల మనోభావాలు గౌరవించిన సీఎం కు అశ్విని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉద్యమ పోరాట ఫలితమే.. సుంకోజి దామోదర్

ప్రజల ఉద్యమ ఫలితమే రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అని జేఏసీ నాయకులు సుంకోజి దామోదర్ అన్నారు. అంచలంచెలుగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న అన్ని రాజకీయ పక్షాలకు, ప్రతి వ్యక్తికి, రెవెన్యూ డివిజన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యమానికి బాసటగా ‘విధాత’

ఉద్యమానికి బాసటగా రామాయంపేట… నియోజవర్గం రద్దుతో… ప్రభావం కోల్పోయిన…రామాయంపేట.. గత చరిత్ర ను… ఉద్యమ తీరు తెన్నుపై విధాత ప్రత్యేక కథనం రాసింది. జేఏసీ నాయకుల అభిప్రాయాలతో కథనం రాసింది. జేఏసీ నాయకులు సుకోజి దామోదర్, పోచమ్మ ల శ్రీనివాస్ లు ఉద్యమం పై రాసిన కథనాలను గుర్తు చేసుకున్నారు. రామాయంపేట వెనుకబాటు తనం, పంచాయతీ సమితి నుంచి …అసెంబ్లీ దాకా.. అనే కథనం ‘విధాత’ ప్రత్యేక కథనం రాసింది.

Ramayampeta | రామాయంపేట.. రెవెన్యూ డివిజన్ పోరాటం ఉదృతం

Ramayampet | ఎమ్మెల్యేకు చిత్తశద్ది ఉంటే.. సీఎం పర్యటనలోగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయించాలి

Medak | ఎమ్మెల్సీ శేరిని కలిసిన రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ

Medak | MLA పద్మ దేవేందర్ రెడ్డి రాజీనామా చేస్తేనే రెవెన్యూ డివిజన్ సాధ్యం: తిరుపతిరెడ్డి

Eetala | మెదక్ రెవెన్యూ డివిజన్ కోసం ఈటెలను కలిసిన జేఏసి నాయకులు

ఉదృతమవుతున్న.. ‘రామాయంపేట’ డివిజన్ సాధన ఉద్యమం

Medak: మ‌ళ్ళీ తెర‌పైకి రామాయంపేట నియోజ‌క‌వ‌ర్గం!

Medak | రామాయంపేటపై సిద్దిపేట నేతల కుట్ర.. BRS పాలనా తీరుపై ధ్వజం: కాంగ్రెస్ నేతలు

Medak | రామాయంపేట రెవెన్యు డివిజన్ తెచ్చే బాధ్యత నాదే: తిరుపతి రెడ్డి