వ్యూహం నిలిపివేతకు స్టే నిరాకరణ
రాంగోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్ పై స్టే విధించాలని నారా లోకేశ్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్టేకు నిరాకరించింది

- 28న హైకోర్టు విచారణ
విధాత: రాంగోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిలిపివేయాలని, రిలీజ్ పై స్టే విధించాలని నారా లోకేశ్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్టేకు నిరాకరించింది. అయితే ఈ నెల 28న దీనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. చిత్ర బృందం తరుపున అదే రోజు తమ వాదనలు వినిపిస్తున్న నిర్మాత తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
మరోవైపు హైద్రాబాద్‌ల్‌ని రాంగోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని నినాదాలు చేస్తు సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టి నిరసన తెలిపారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.